
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
విద్యార్థుల కృషి ఫలించదు. ఇంట్లో చికాకులు తప్పవు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో కష్ట పడ్డా ఫలితం కనిపించదు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు.
ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో మీ ప్రతిభ చాటుకుంటారు. మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు.
బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అందరిలో మీ విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. బంధు, మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. కుటుంబ విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు తప్పవు.
వ్యాపార నిర్వహణలో లోపాలు అధిగమిస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. ఇంటా బయటా చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.
వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగుల శ్రమ ఫలించదు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూర ప్రయాణాల వల్ల శ్రమ పెరుగుతుంది.
ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులలో కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన పనులకు శ్రీకారం చూడతారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి.
స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి.