Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!

Published : Sep 11, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 11.09.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి డబ్బు సహయం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయటా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు.

413
మిథున రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం ఉండదు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహన లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపారాలు అనుకూలం.

713
కన్య రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

813
తుల రాశి ఫలాలు

ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. ఇంటా బయటా చికాకులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో శ్రమ అధికమవుతుంది. ఇంటా బయటా బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు.

1113
మకర రాశి ఫలాలు

ఆరోగ్యం అంతగా సహకరించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాత రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి.

1213
కుంభ రాశి ఫలాలు

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి.

1313
మీన రాశి ఫలాలు

కొన్ని పనుల్లో శ్రమ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దాయదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories