పాద రక్షలకు బయటి వాతావరణంలోని ప్రకంపలను ఆకర్షించే శక్తి ఉంటుంది. చెప్పులను ఇంట్లోకి తీసుకురావడం వల్ల బయటి మురికితో పాటు... నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లో కి ప్రవేశిస్తుంది. ఇది ఇంటి పవిత్రతను దెబ్బతీస్తుంది. ఫలితంగా ఇంట్లో ప్రశాంతత కూడా తగ్గిపోతుంది.
ఏ దిశలలో చెప్పులు అస్సలు ఉంచకూడదు?
ఇంటి శ్రేయస్సును కాపాడుకోవడానికి కొన్ని దిశల్లో చెప్పులు, షూలు అస్సలు ఉంచకూడదు.
ఈశాన్య దిశ: ఈశాన్యం దేవతల దిశ , గురు గ్రహానికి అధిపతి. అత్యంత పవిత్రమైన ఈ దిశలో చెప్పులు ఉంచితే సానుకూల శక్తి, ఆధ్యాత్మిక శ్రేయస్సు నిలిచిపోతాయి.
ఉత్తర దిశ: ఉత్తరం సంపదకు అధిపతి అయిన కుబేరుడి స్థానం. ఇక్కడ చెప్పులు ఉంచడం వల్ల ఆర్థిక వృద్ధి మందగించి, డబ్బు కొరత ఏర్పడుతుంది.
తూర్పు దిశ: తూర్పు దిశకు అధిపతి సూర్యుడు. పాదరక్షలతో సంబంధం ఉన్న శని, సూర్యుడికి శత్రు గ్రహం. అందువల్ల తూర్పున చెప్పులు ఉంచితే ఇంట్లో కలహాలు, దురదృష్టం పెరుగుతాయి.
పూజ గది & వంటగది: ఇవి స్వచ్ఛతకు, అన్నపూర్ణా దేవికి ప్రతీకలు. ఈ ప్రాంతాల వద్దకు చెప్పులతో వెళ్లడం వల్ల పూజా ఫలం, ఇంట్లోని ఆరోగ్యకర వాతావరణం దెబ్బతింటాయి.
ప్రధాన ద్వారం: గుమ్మం ముందే చెప్పులను చెల్లాచెదురుగా ఉంచడం వల్ల లక్ష్మీదేవి ప్రవేశానికి ఆటంకం కలుగుతుంది.