
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.
ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అవరోధాలు తొలగుతాయి.
సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగులు శాలరీ విషయంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
వ్యాపారాలలో సొంత ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. రుణ యత్నాలు కొంత కష్టంతో పూర్తవుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. దూరపు బంధువుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ పెద్దలతో సందడిగా గడుపుతారు. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు వస్తాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
ముఖ్యమైన వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుంచి అందిన ఒక వార్త నిరుత్సాహపరుస్తుంది.
బంధు మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.
సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. రుణ సంబంధిత సమస్యల వల్ల ఒత్తిడి తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.