Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. కొత్త పరిచయాలు లాభదాయకం!

Published : Jun 09, 2026, 12:52 PM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 09.06.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఇంటా బయటా ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. పనులు చకచకా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.

313
వృషభ రాశి ఫలాలు

ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. దైవచింతన కలుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం దక్కదు.

413
మిథున రాశి ఫలాలు

బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.

613
సింహ రాశి ఫలాలు

ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

713
కన్య రాశి ఫలాలు

నూతన ఉద్యోగ యోగం ఉంది. కుటుంబం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

813
తుల రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అధిక శ్రమతో కానీ పనులు పూర్తి కావు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

1113
మకర రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. బంధువుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగాలలో శ్రమ మరింత అధికం అవుతుంది.

1213
కుంభ రాశి ఫలాలు

బంధువుల నుంచి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

1313
మీన రాశి ఫలాలు

నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories