Chandra Gochar: స్వాతి నక్షత్రంలోకి చంద్రుడు..ఈ ఐదు రాశుల పంట పండినట్లే
చంద్రుడు రెగ్యులర్ గా నక్షత్రాలను మారుతూ ఉంటాడు. ప్రస్తుతం స్వాతి నక్షత్రంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో ఐదు రాశులకు అదృష్టాన్ని మోసుకురానున్నాడు. మరి, ఆ రాశులేంటో చూద్దామా..
చంద్రుడు రెగ్యులర్ గా నక్షత్రాలను మారుతూ ఉంటాడు. ప్రస్తుతం స్వాతి నక్షత్రంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో ఐదు రాశులకు అదృష్టాన్ని మోసుకురానున్నాడు. మరి, ఆ రాశులేంటో చూద్దామా..
జోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడి మనస్సు, భావోద్వేగాలకు ప్రతినిధిగా పరిగణిస్తారు. ‘చంద్రమా మనసో జాతః’ అని మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. అంటే, చంద్రుడు ప్రతి నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడు. ప్రతిసారీ నక్షత్రం మారినప్పుడు అన్ని రాశులపై ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం చంద్రుడు రాహువు అధిపత్యం వహిస్తున్న స్వాతి నక్షత్రంలోకి అడుగుపెట్టాడు. ఈ మార్పు కొన్ని రాశులకు అనుకూలంగా మారనుంది. ముఖ్యంగా ఐదు రాశుల పంట పండినట్లే. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా...
1.సింహ రాశి...
చంద్రుడు స్వాతి నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల సింహ రాశివారి అదృష్ట సమయం మొదలైంది. ఆర్థికంగా బాగా కలిసిరానుంది. సంపాదన పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార రంగాల్లో బాగా కలిసొస్తుంది. అందరి ముందు మంచి పేరు తెచ్చుకుంటారు.సమయం బాగా కలిసొస్తుంది కాబట్టి...ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మంచే జరుగుతుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ గోచారం ఉద్యోగ , వ్యక్తిగత జీవితాల్లో శుభవార్తలు తీసుకొస్తుంది. పెట్టిన ప్రతి అడుగు లాభదాయకం అవుతుంది. అంతేకాకుండా, కొత్త ప్రాజెక్టులు, ఆర్థిక అవకాశాలు కూడా ముందుకు వస్తాయి. మీ ఆత్మవిశ్వాసం భరోసాగా నిలుస్తుంది.
కుంభ రాశి
ఈ రాశి వారికి ప్రతి క్షణం విజయదాయకంగా మారుతుంది. డబ్బు ఖర్చయినా, దానికి తగినట్లు ఆదాయం కూడా లభిస్తుంది. గతంలో కోల్పోయిన మనశ్శాంతి తిరిగి లభించే అవకాశం ఉంది. శారీరక, మానసిక శాంతి రెండూ కలిసొస్తాయి.
తులా రాశి
తులా రాశి వారికి కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. పాత విభేదాలు తొలగిపోతాయి. అలాగే, గృహసౌఖ్యం, ధనసంపత్తి పెరిగే సూచనలు ఉన్నాయి. భగవన్నామస్మరణ చేస్తూ ప్రతిరోజూ ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తే, అదృష్టం మరింత బలపడుతుంది.
మేష రాశి
ఈ కాలం మేషరాశి వారి జీవితంలో ఆకస్మిక శుభ పరిణామాలను తీసుకువస్తుంది. ఉద్యోగవర్గానికి పదోన్నతి అవకాశాలున్నాయి. అకస్మాత్తుగా వచ్చే లాభాలు, సంపద మీ పాజిటివ్ ఎనర్జీకి బలంగా నిలుస్తాయి.
గమనిక:
ఈ సమాచారం జ్యోతిషశాస్త్రం, పంచాంగ విశ్లేషణల ఆధారంగా రూపొందించబడింది. ఇది సాధారణ మార్గదర్శకంగా తీసుకోవలసిందిగా కోరుతున్నాం. ప్రతి వ్యక్తికి అనుగుణంగా ఖచ్చితమైన జాతక విశ్లేషణ కోసం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.