Today Astrology: ఓ రాశివారికి వాహన గండం..!

First Published | Jun 18, 2024, 5:16 AM IST

Today Horoscope: ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

telugu astrology


1.మేష రాశి..
మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)
ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.  చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వారితో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో నేడు మంచి లాభాలు చూస్తారు. వృత్తి, ఉద్యోగాలు అంతా అనుకూలంగా ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

telugu astrology


2.వృషభ రాశి..
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)
కుటుంబ సభ్యులతో తొందరపడి గొడవలు పడకండి. నేడు ఆర్థిక వ్యవహారాలు కాస్త నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన పనులు మందకోడిగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.


telugu astrology


3.మిథున రాశి..
మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )
నేడు మిథున రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టిపెడతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురౌతాయి.  ఇంటా, బయట శారీరక శ్రమ కాస్త ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారాలు కూడా సజావుగా సాగవు. నిరుద్యోగులు ఎంత ప్రయత్నించినా.. ఫలితం దక్కదు.

telugu astrology

4.కర్కాటక రాశి..
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
కర్కాటక రాశివారికి ఈ రోజు ముఖ్యమైన విషయంలో స్నేహితుల సహాయం లభిస్తుంది. ఈ రోజు వీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. వ్యాపారాల్లోనూ ఆశించిన విజయం లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

telugu astrology

5.సింహ రాశి..
సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)
సింహ రాశివారికి స్నేహితులతోనే మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది.  అవసరానికి డబ్బు అందక.. ఇబ్బంది పడతారు. కొత్త గా అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు రావచ్చు.  వ్యాపారాలు సైతం అంతంత మాత్రంగానే సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో   శ్రమ మరింత పెరుగుతుంది.
 

telugu astrology


6.కన్య రాశి..
కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)
కుటుంబ సభ్యుల నుంచి కన్య రాశివారికి ఆకస్మిక ధనలాభం పొందుతారు.  చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా లాభాలు పొందుతారు.నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

telugu astrology


7.తుల రాశి..
తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )
 వ్యాపార కార్యక్రమాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది.

telugu astrology


8.వృశ్చిక రాశి..

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. ఇంటికి చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.  సోదరులతో వివాదాలు నేడు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసొస్తాయి.   పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి.  నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది,

telugu astrology


9.ధనస్సు రాశి..

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)
నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు మరింత స్పీడ్ చేస్తారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆప్తుల నంుచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చేపట్టే పనులలో విజయం సాధిస్తారు. అదనపు బాధ్యతల నుంచి ఉఫశమనం లభిస్తుంది.

telugu astrology

10.మకర రాశి..
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)
ఈ రోజు మకర రాశివారు ముఖ్యమైన పనులను వాయిదా పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. అయితే... ఎక్కువ వృథా ఖర్చులు ఉండే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని సమస్యలు ఎదురౌతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా నిరుత్సాహ పరుస్తాయి.
 

telugu astrology


11.కుంభ రాశి..
కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )
నేడు కుంభ రాశివారు చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. దూరపు బంంధువులతో  స్వల్ప విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశం వచ్చే ఉంది.  వ్యాపారాల్లో నూత పెట్టుబడులు పెట్టే ముందు కాస్త ఆలోచించాలి.  విద్యార్థులు పోటీ పరీక్షలలో మరింత కష్టపడాల్సి వస్తుంది.

telugu astrology

12.మీన రాశి..
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
మీన రాశివారికి ఈ రోజు ఇంటా బయట మాటకు విలువ పెరుగుతుంది.  ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. నిరుద్యోగులకు చాలా కాలం తర్వాత  శుభవార్త వింటారు. ఇంటికి అవసరం అయిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అందుకునే అవకాశం ఉంది.

Latest Videos

click me!