గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి దుస్తులు మరొకరు వేసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా మరణించిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్నవారు వాటిని వేసుకోకూడదు. మరణించిన వ్యక్తి దుస్తులను వేసుకోవడం వల్ల వారి ఆత్మను ఆకర్షించినట్టు అవుతుంది. దీనివల్ల ఆ ఆత్మ మీతో అనుబంధాన్ని పెంచుకుని ఇబ్బందిపడుతుంది. తనవారి నుంచి దూరంగా వెళ్లలేక సతమతమవుతుంది. ఇది పితృ దోషానికి కారణమవుతుంది
మరణించిన వారి వ్యక్తి దుస్తులను ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? మీతో లేదా మీ కుటుంబంతో మీ పూర్వీకులతో ఎటువంటి సంబంధం లేని నిరుపేదలకు వాటిని దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులు మరణానంతరం మోక్షం పొందుతారు. వారి ఆత్మలు కూడా ముక్తి పొందుతాయని గరుడ పురాణం చెబుతోంది.