సంపదను ఎవరు కోరుకోరు చెప్పండి. ఎవరైనా సరే ఇంట్లో ఎప్పటికీ డబ్బుల కొరత రావద్దనుకుంటారు. మరి అలా ఎప్పుడు ఇళ్లు డబ్బులతో కళకళలాడాలంటే ఈ వాస్తు టిప్స్ పాటిస్తే చాలట. మరి అవెంటో చూసేయండి.
పురణాల ప్రకారం కుబేరుడు ధన, సంపదల దేవుడు. 9 ఐశ్వర్యాలకు అధిపతి అంటారు. కుబేరుడు ఉండే ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు అంటారు. సాధారణంగా కుబేరుడిని యంత్ర రూపంలో పూజిస్తారు. కొత్త ఇల్లు కట్టాలనుకుంటే కుబేరుడి దిశలో కడితే ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. ధన, సంపదలు వృద్ధి చెందుతాయి.
25
కుబేరుడి దిశ ఏది?
వాస్తు శాస్త్రం ప్రకారం, ధన దేవుడైన కుబేరుడు ఇంటి ఈశాన్యంలో ఉంటాడు. దీన్ని ఈశాన్య మూల అంటారు. ఇంట్లో ఈ దిశలోనే సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది.
35
ఈశాన్యంలో ఇల్లు కట్టడం శుభమా?
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యంలో ఇల్లు కట్టడం చాలా మంచిది. ఈ దిశలో ఇల్లు కడితే ఇంట్లో ఎప్పుడూ సంతోషం, శాంతి ఉంటాయి. డబ్బు కొరత ఉండదు. ఈ దిశలో ఇల్లు లేదా డబ్బు పెట్టె ఉంటే డబ్బు రాక పెరుగుతుంది. ఈశాన్య దిశలో ఇల్లు ఉంటే అదృష్టంగా భావిస్తారు. ఈ దిశలో కట్టిన ఇంట్లో ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారు.
45
పూజ గది:
ఇంట్లో ఈ దిశలో పూజ గది ఉంటే చాలా మంచిది. ఈ దిశలో బరువైన వస్తువులు పెట్టకూడదు. కుబేర యంత్రం పెట్టాలి. డబ్బు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ దిశలో కుబేర యంత్రం పెడితే మంచి ఫలితాలు వస్తాయి.
55
ఇవి గుర్తుంచుకోండి:
వాస్తు ప్రకారం ఈశాన్యంలో మెట్లు కట్టకూడదు. ఈ దిశలో చెప్పులు, చెత్త వేయకూడదు. ఈ దిశలో బాత్రూమ్ కూడా కట్టకూడదు.