Astrology: రాసి పెట్టుకోండి.. మార్చి 15 నుంచి ఈ రాశుల వారి జీవితాలు మారడం ఖాయం.

Published : Feb 19, 2025, 01:24 PM ISTUpdated : Feb 19, 2025, 03:30 PM IST

గ్రహాల మార్పు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే గ్రహాల పయనంలో మార్పు సంభవించినప్పుడు మంచి లేదా చెడు ప్రభావాలను చూపుతాయి. బుధుడు తిరోగమనంతో కొన్ని రాశులపై ప్రభావం పడనుందని పండితులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏంటి.? ఎలాంటి ప్రభావం పడనుంది..   

PREV
15
Astrology:  రాసి పెట్టుకోండి..  మార్చి 15 నుంచి ఈ రాశుల వారి జీవితాలు మారడం ఖాయం.

బుధ గ్రహం ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు మీన రాశిలో ఉండనున్నాడు. అయితే ఇదే సమయంలో మార్చి 15వ తేదీ నుంచి బుధుడు తిరోగమనం ప్రారంభమవుతుంది. బుధగ్రహం వేగం తగ్గి మార్చి 15వ తేదీన తిరోగమనంలో కదలనున్నాడు. ఇలా ఏప్రిల్‌ 7వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. బుధగ్రహం తిరోగమనం అన్ని రాశులపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రోజుల వారికి చాలా మంచి జరగనుందని పండితులు అంటున్నారు. ఈ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

25
capricorn

మకర రాశి వారికి కొత్త అవకాశాలు: 

బుధుడి తిరోగమం కారణంగా లబ్ధి పొందే రాశుల వారిలో మకరం ముందు స్థానంలో ఉంటారు. ఈ రాశి జాతకుల మూడవ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉండడంతో మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. కష్టాలను ఎదుర్కునే ధైర్యం వస్తుంది. పరిస్థితులను చాకచక్యంగా ఎదుర్కొంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారు కూడా. 
 

35

వృశ్చిక రాశి వారికి మంచి లాభాలు: 

వృశ్చిక రాశి వారికి మార్చి 15 నుంచి మంచి లాభాలు రానున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులకు మంచి ఆదాయం లభిస్తుంది. ప్రేమ బంధాలు బలోపేతమవుతుతాయి. ఈ రాశి వారి ఐదవ ఇంట్లో బుధుడు తిరోగమనంతో మనస్సులో కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తాయని పండితులు చెబుతున్నారు. 
 

45

కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది: 

బుధుడు తిరోగమనం కారణంగా కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. ఏ పని చేపట్టినా లాభాలు వరిస్తాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి తొమ్మిదవ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉంటాడు. దీంతో పెద్ద నుంచి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక భావనలు పెరిగే అవకాశం ఉంటుంది. 
 

55

మీన రాశి వారికి ఎలా ఉండనుందంటే: 

మీన రాశిలో బుధుడు చలనంలో ఉంటాడు. ఈ కారణంగా ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. అలాగే ఆత్మపరిశీలన ఎక్కువగా చేసుకుంటారు. మీలోని తప్పులను గుర్తించి వాటిని అధిగమిస్తారు. 

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి. 
 

Read more Photos on
click me!

Recommended Stories