Today Horoscope: ఓ రాశివారు డబ్బు విషయంలో బంధువులతో జాగ్రత్తగా ఉండాలి

First Published | Jul 21, 2024, 5:30 AM IST

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..
 

telugu astrology


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-వృత్తి ఉద్యోగులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ రోజంతా చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు.  మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.  కొత్త వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరుతుంది. మంచి పేరు ప్రతిష్టలున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.  వ్యాపారం సాఫీగా సాగుతుంది. 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- కుటుంబం విషయంలో ఆలోచించిన నిర్ణయం తీసుకోవాలి. ఇంటా, బయట మీ విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో ఉన్న గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. పనులు అనుకున్న సమయానికే పూర్తవుతాయి. ఉద్యోగులకు ఈ రోజు లాభాదాయకంగా ఉంటుంది. ఊహించని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  వ్యాపారులు మంచి లాభాలను అర్జిస్తారు. 
 


telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- నిరుద్యోగుల కష్టానికి సరైన ఫలితం రాదు. మొదలుపెట్టిన పనులను వాయిదా వేయాల్సి వస్తుంది.  డబ్బు విషయంలో బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఇంటి నిర్మాణ పనులు అనుకున్న సమయానికి పూర్తికావు.  దైవచింతనలో ఉంటారు. వ్యాపారాలు నష్టాల్లో ఉంటాయి. 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- మొదలుపెట్టిన పనులు మీరు అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. ఇంట్లో వారి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగులకు ఈ రోజు కలిసి వస్తుంది. ఆస్థికి సంబంధించిన క్రయ విక్రయాలు లాభాదాయకంగా ఉంటాయి. అవసరానికి వేరేవారి నుంచి సహాయం పొందుతారు. 
 

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- కుటుంబ సభ్యులు మీకు అన్నివేళలా అండగా ఉంటారు. వీరి సహాయ, సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అన్నదమ్ములతో ఆస్థికి సంబంధించి వివాదాలు ఒకరి జోక్యంతో పరిష్కరించబడతాయి. ఇంటికి బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగులకు ఈ రోజు బాగుంటుంది. 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- జీవిత భాగస్వామితో గొడవలు వస్తాయి, వృత్తి  ఉద్యోగులకు ఇతరుల ప్రవర్తన చిరాకు కలిగిస్తుంది.  ఇంట్లో ఒకరితో ఒకరికి వివాదాలు వస్తాయి. వ్యాపారాలు ముందుకు సాగవు.  ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది.  

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- అనవసర ఖర్చులు పెరుగుతాయి. వాతావరణ మార్పు వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడతారు. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఎంతో నష్టపోవాల్సి వస్తుంది.  అవసరానికి అప్పులు చేస్తారు. ఒకవిషయంపై ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు అధిక పనిభారం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి. 
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఆర్థిక పరిస్థితి మునపటి కంటే మెరుగ్గా ఉంటుంది.  అన్నదమ్ములతో ఉన్న గొడవలు సర్దుమనుగుతాయి. వ్యాపార విస్తరణ సజావుగా సాగుతుంది. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.  కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. 

telugu astrology


ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- కొన్ని విషయాలను కుటుంబ సభ్యులతో చర్చించకపోవడమే మంచిది. ఇంట్లో కొందరి ప్రవర్తన చిరాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకు వెళతారు. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ప్రయాణం చేసే సూచనలు ఉన్నాయి. 
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- ఉద్యోగులకు ఈ రోజు కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. తెలివైన ఆలోచనలతో లాభాలను పొందుతారు. ఇంట్లో శుభకార్యాలకు ప్రణాళికలు రూపొందిస్తారు.  వ్యాపారులు మంచి లాభాలను అర్జిస్తారు. 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. ముఖ్యమైన పేపర్లను జాగ్రత్తగా పెట్టుకోవాలి. వృత్తి వ్యాపారులకు నష్టాలే మిగులుతాయి. ఇష్టదైవ దర్శనం చేసుకుంటారు. అప్పులు పుట్టవు. 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఇంటికి బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. చాలా కాలం తర్వాత చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీరు ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులకు  ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆస్థికి సంబంధించిన వివాధాలు ఒకరి జోక్యంతో పరిష్కరించబడతాయి.  

Latest Videos

click me!