Birth Date: న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారిలో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వారు ఏ పని చేసినా త్వరగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా కొన్ని పుట్టిన తేదీలను విజయానికి అనుకూలమైన తేదీలుగా పరిగణిస్తారు. ఆ అదృష్ట తేదీలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలామందికి పుట్టిన తేదీకి, వ్యక్తిత్వానికి, జీవితంలో ఎదురయ్యే పరిణామాలకు ఏదైనా సంబంధం ఉందా అనే ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా సంఖ్యా శాస్త్రం, జ్యోతిష్య శాస్రాల ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల స్వభావం, ఆలోచనా విధానం, నిర్ణయాలు తీసుకునే తీరు గురించి అంచనా వేయవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టినవారు పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వం, వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి లక్షణాలను కలిగి ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది. దానివల్ల వారు జీవితంలో త్వరగా సక్సెస్ అవుతారట. ఆ తేదీలేంటో చూద్దాం.
25
1వ తేదీన జన్మించిన వారు
సంఖ్యా శాస్త్రం ప్రకారం.. ఏ నెలలో అయినా 1వ తేదీన పుట్టినవారిపై సూర్యుడి ప్రభావం ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ఇతరులు చెప్పిన దారిలో నడవడం కంటే తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకోవడాన్ని వీరు ఇష్టపడతారు. ఒక పని చేయాలని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని పూర్తి చేయాలనే పట్టుదల ఎక్కువ. ఉద్యోగం, వ్యాపారం, సృజనాత్మక రంగం లేదా వృత్తి ఏదైనా సరే.. త్వరగా అవకాశాలను అందిపుచ్చుకునే స్వభావం వీరిలో ఉంటుంది.
35
5వ తేదీన పుట్టినవారు
ఏ నెలలో అయినా 5వ తేదీన పుట్టినవారు చాలా చురుకుగా, తెలివిగా వ్యవహరిస్తారని న్యూమరాలజీ చెబుతోంది. కొత్త విషయాలను త్వరగా నేర్చుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా మారడం వీరి ప్రత్యేకత. ఎక్కడ అవకాశం కనిపించినా దాన్ని ఉపయోగించుకోవడానికి వీరు ప్రయత్నిస్తారు. కమ్యూనికేషన్, వ్యాపారం, మార్కెటింగ్, మీడియా వంటి రంగాల్లో వీరి చురుకుదనం వల్ల త్వరగా గుర్తింపు పొందుతారు.
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 8వ తేదీన జన్మించినవారు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా ఓర్పుతో ముందుకు సాగడం వీరి బలం. వీరికి విజయం కొన్నిసార్లు ఆలస్యమైనప్పటికీ, స్థిరంగా కొనసాగుతుంది. వీరు బాధ్యత, క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేయడం వల్ల కెరీర్‌లో మంచి స్థాయికి చేరుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట.
55
9వ తేదీన జన్మించినవారు
న్యూమరాలజీ ప్రకారం.. 9వ తేదీన పుట్టినవారు ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఉత్సాహం కలిగి ఉంటారు. వీరు ఏదో ఒకటి సాధించాలనే బలమైన కోరికతో ముందుకు సాగుతారు. కష్టమైన పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గరు. ఇతరులకు సహాయం చేయాలనే మనస్తత్వం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. తమ ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకుని పనిచేస్తే జీవితంలో వేగంగా గుర్తింపు, విజయాన్ని పొందుతారు.