ఈ రాశివారికి ఉన్న అతి పెద్ద సమస్య ఇదే...!

Published : Oct 07, 2022, 02:19 PM IST

కొందరికి పెద్ద సమస్యలు ఉంటే.. మరి కొందరికి చిన్న సమస్యలు ఉంటాయి. ఎవరి పరిస్థితిని బట్టి.. వారికి ఆ సమస్యలు ఉంటాయి. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారికి ఉన్న అతి పెద్ద సమస్య ఏంటో ఓసారి చూద్దాం..

PREV
113
ఈ రాశివారికి ఉన్న అతి పెద్ద సమస్య ఇదే...!

జీవితంలో సమస్యలు లేనివారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి. అయితే.. కొందరికి పెద్ద సమస్యలు ఉంటే.. మరి కొందరికి చిన్న సమస్యలు ఉంటాయి. ఎవరి పరిస్థితిని బట్టి.. వారికి ఆ సమస్యలు ఉంటాయి. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారికి ఉన్న అతి పెద్ద సమస్య ఏంటో ఓసారి చూద్దాం..
 

213

1.మేష రాశి..

ఈ రాశివారికి ఉన్న అతి పెద్ద సమస్య... వారిమీద వారికి నమ్మకం లేకపోవడం. తాము జీవితంలో తాము అనుకున్నది సాధించలేమని  అనుకుంటూ ఉంటారు. అందుకే.. ఏదీ ప్రయత్నించరు. ప్రయత్నించినా.. వెంటనే వదిలేస్తారు.
 

313

2.వృషభ రాశి..
ఈ రాశివారికి ఉన్న అతి పెద్ద సమస్య... వారిని వారే శత్రువులా భావిస్తూ ఉంటారు. వారిని వారే తక్కువ చేసుకుంటూ ఉంటారు. దేనీకి తాము తగినవారం కాదు అని వారు భావిస్తూ ఉంటారు.

413

3.మిథున రాశి..
ఈ రాశివారు ఎదుటివారు తమ గురించి ఏమనుకుంటున్నారా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా చేయాలన్నా.. వామ్మో.. వాళ్లు ఏమనుకుంటారో.. వీళ్లు ఏమనుకుంటారో అని భయపడుతూ ఉంటారు. ఎప్పుడైతే.. ఇతరలను పట్టించుకోవడం మానేస్తారో.. వీరు జీవితంలో అనుకున్నది సాధించగలరు.

513

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారికి అభద్రతా భావం చాలా ఎక్కువ. ముఖ్యంగా రిలేషన్ షిప్స్. అంటే ప్రేమ, స్నేహం ఇలా ఏదైనా సరే.. వాళ్లు తమను వదిలేసి వెళ్లిపోతారేమో అనే భయం వీరిలో ఎక్కువగా ఉంటుంది.

613

5.సింహ రాశి..
ఈ రాశివారు తమను తామే కిందకులాగుతూ ఉంటారు. తమను తాము ప్రోత్సహించుకోరు. ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండని ఎదురుచూస్తూ ఉంటారు. అలా కాకుండా.. పరిస్థితి కి అనుగుణంగా వీరు తమను తాము ప్రోత్సహించుకున్నా.. నచ్చచెప్పుకున్నా... వీరికి అసలు సమస్య అనేది ఉండదు.
 

713


6.కన్య రాశి..
ఈ రాశివారు ఎవరినీ నమ్మరు. ఎందుకంటే.. ఎవరినైనా నమ్మితే.. వారు తమను కిందకు లాగేస్తారు అని భయపడుతూ ఉంటారు. అందుకే... వీరు తమకు ఇతరుల మధ్య గోడ కట్టేస్తూ ఉంటారు. దీని వల్ల ఎవరికీ ఏమీ చెప్పులేక సమస్యల్లో పడుతూ ఉంటారు.

813

7.తుల రాశి..
తుల రాశివారికి ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం తెలీదు. కనీసం ఎదుటివారివి కాదు కదా తమ ఫీలింగ్స్ ని కూడా వారు అర్థం చేసుకోలేరు. దీని వల్ల వీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.
 

913

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు తమను ఎవరూ పట్టించుకోరు అని ఫీలౌతూ ఉంటారు. తాము ఉన్నా కనీసం ఎవరూ గుర్తించరని.. అందుకే తాము ఉన్నా.. లేకున్నా ఒకటేనని వారు ఫీలౌతూ ఉంటారు.

1013

9.ధనస్సు రాశి..
ఈ రాశివారు తొందరగా ఎవరితోనూ బాండింగ్ పెంచుకోరు. అలా రిలేషన్ పెంచుకోవడం వల్ల...  తమను నిత్యం ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తూ ఉంటారని వారు ఫీలౌతూ ఉంటారు. తమకు స్వేచ్ఛ ఉండదని భావిస్తూ ఉంటారు. ఇదే వీరి అతి పెద్ద సమస్య.
 

1113

10.మకర రాశి..
ఈ రాశివారు బాగా కష్టపడతారు. కానీ వీరికి ఏదైనా మొదలుపెట్టడం సులువే. కానీ.. ఎక్కడ ఆపాలి అనే విషయం మాత్రం వీరికి తెలీదు. దీంతో... వారు సమస్యలు ఎదుర్కొంటారు.

1213


11.కుంభ రాశి..
కుంభ రాశివారు వారికి ఏం కావాలో కూడా నోరు తెరిచి చెప్పలేరు. దీంతో... ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు  వీరు చాలా ఇబ్బంది పడతారు. తమకు కావాల్సింది ఏంటో చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ గా వీరు కామ్ గా ఉంటారు.
 

1313

12.మీన రాశి..
ఈ రాశివారు లేని సమస్యలను తలుచుకొని సమస్యలు తెచ్చకుంటారు. జీవితం ఎప్పుడు ఎలా మారుతుంది..? పెళ్లి తర్వాత అలాంటి సమస్యలు వస్తాయేమో.. ఇలా వస్తాయేమో ఇలా ఊహించుకొని వారు సమస్యల్లో పడుతూ ఉంటారు. భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రస్తుతాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు.
 

click me!

Recommended Stories