ఈ రాశివారిని మానిప్యూలేట్ చేయడం చాలా సులువు..!

Published : Oct 07, 2022, 12:42 PM IST

ఎదుటివారికి ఎలాంటి హాని చేయకుండా చేస్తున్న మానిప్యూలేషన్ వల్ల ఎలాంటి నష్టం ఉండదు.  కాగా.. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారికి ఎలా మానిప్యూలేట్ చేయవచ్చో తెలుసుకుందాం...

PREV
113
 ఈ రాశివారిని మానిప్యూలేట్ చేయడం చాలా సులువు..!

మానిప్యులేషన్ ఈ పదం చాలా మంది నెగిటివ్ గా తీసుకుంటారు. ఒక విధంగా అది తప్పు కావచ్చు. కానీ మరో విధంగా చెప్పాలంటే మానిప్యూలేట్ చేసి... బాధలో ఉన్నవారిని సంతోషపెట్టవచ్చు కూడా. ఎదుటివారికి ఎలాంటి హాని చేయకుండా చేస్తున్న మానిప్యూలేషన్ వల్ల ఎలాంటి నష్టం ఉండదు.  కాగా.. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారికి ఎలా మానిప్యూలేట్ చేయవచ్చో తెలుసుకుందాం...

213
Zodiac Sign

1.మేష రాశి..

ఈ రాశివారిది చిన్న పిల్లల మనస్తత్వం. అన్నింట్లో తామే నెంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశివారిని మంచి మాటలతో మానిప్యూలేట్ చేయవచ్చు. అలా చేసి... వారిని మీ కంట్రోల్ లోకి తెచ్చుకోవచ్చు. కంట్రోల్ ఉన్నంత కాలం వారు మీ మాట వింటారు.

313
Zodiac Sign

2.వృషభ రాశి..

ఈ రాశివారి అభిరుచులన్నీ చాలా కాస్ట్ లీగా ఉంటాయి. అయితే... ఈ ఆలోచనను వారి నుంచి మార్చడానికి కొన్ని మంచి మాటలు చెబితే సరిపోతుంది. ఈ రాశివారిని కేవలం వారికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ తో సులభంగా మానిప్యూలేట్ చేసేయవచ్చు.

413
Zodiac Sign

3.మిథున రాశి..

స్వేచ్ఛాయుతమైన, తిరుగుబాటు చేసే వ్యక్తి, ఆదేశాలను తీసుకోలేరు. కాబట్టి వారిని అడగవద్దు. వారిని కంగారు పెట్టండి. ఈ రాశివారికి ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయడం మంచిది. కన్ఫ్యూజ్ చేయడం వల్ల వారికి ఏది కావాలో వీరు ఎంచుకోలేరు. ఆ విధంగా వీరిని మానిప్యూలేట్ చేయవచ్చు. 

513
Zodiac Sign

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా ఎమోషనల్. మాట్లాడితే ఏడుస్తూ ఉంటారు. ఎదుటివారు బాధలో ఉన్నా తట్టుకోలేరు. ఎవరైనా బాధలో ఉన్నారంటే వారి కోసం ఏదైనా చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి వీరిని ఎమోషన్స్ తో మానిప్యూలేట్ చేయవచ్చు.

613
Zodiac Sign

5.సింహ రాశి..
ఈరాశివారికి అహంకారం కాస్త ఎక్కువే. ఈ రాశివారిని మానిప్యూలేట్ చేయాలన్నా.. వారితో ఏదైనా పని చేయించాలన్నా.. వారి అహంపై కొడితే సరిపోతుంది. లేదంటే... వారిని పొగిడితే చాలు వారు ఏదైనా చేయడానికి వెనకాడరు. ఈజీగా మానిప్యూలేట్ అయిపోతారు.

713
Zodiac Sign

6.కన్య రాశి..
ఈ రాశివారు చాలా తెలివైనవారు. అంత సులభంగా వీరు మానిప్యూలేట్ అవ్వలేరు. కాబట్టి.. వీరిని మానిప్యూలేట్ చేయాలంటే... దీనిని పూర్తి చేయగల తెలివితేటలు నీకు తప్ప మరెవరికీ లేవు అని చెబితే చాలు... సులభంగా చేసేస్తారు.

813
Zodiac Sign

7.తుల రాశి..

తుల రాశివారు ప్రతి విషయంలోనూ పర్ఫెక్షన్ కోరుకుంటారు. అయితే... వీరిని పొగడ్తలు, ప్రశంసలతో మానిప్యూలేట్ చేయవచ్చు. మీరు చాలా అద్భుతమైన వ్యక్తులనీ.. దేనిలో అయినా గెలుపు వీరికే సాధ్యం అంటూ చెబితే సరిపోతుంది.

913
Zodiac Sign

8.వృశ్చిక రాశి...

ఈ రాశివారు అందరికన్నా పెద్ద మానిప్యూలేటర్స్. వీళ్లే అందరినీ మానిప్యూలేట్ చేస్తుందటారు. వీరిని మనం చేయాలంటే.. బతిమిలాడటం తప్ప మరేమీ చేయలేం. బతిమిలాడితే పనౌతుంది.
 

1013
Zodiac Sign

9.ధనస్సు రాశి..

ఈ రాశివారు చాలా సరదాగా ఉంటారు.కానీ వారికి కాస్త భయం ఎక్కువ. ఈ భయాన్ని అడ్డుపెట్టుకొని వారిని మానిప్యూలేట్ చేస్తే సరిపోతుంది. ఈజీగా కన్విన్స్ అయిపోతారు.

1113
Zodiac Sign

10.మకర రాశి..

ఈ రాశివారు ఎక్కువగా డబ్బుకి పడిపోతారు. ఈ రాశివారికి డబ్బు లేదంటే.. విజయాన్ని ఆశగా చూపించి... సులభంగా వారిని మానిప్యూలేట్ ఛేయవచ్చు. వీరు ఈ రెండింటికి మాత్రమే వంగుతారు.

1213
Zodiac Sign

11.కుంభ రాశి..
వారు ఎల్లప్పుడూ తెలియని వాటి కోసం పడిపోతారు. ఏదైనా నిషేధించిన దానిని వీరికి ఎరగా వేస్తే... వీరు ఊరికే బుట్టలో పడిపోతారు.వారితో ఏదైనా పని చేయించాలి అనుకుంటే... దానిని చేయకూడదు అని రివర్స్ లో చెబితే సరిపోతుంది.

1313
Zodiac Sign

12.మీన రాశి..

బాధలో ఉన్న ఆడపిల్లగా ఉండండి. వారు మీ కోసం ఏదైనా చేయాలని మీరు కోరుకుంటే, నిస్సహాయంగా ఉండండి. మీనం.. విశ్వాసం ఉన్న వ్యక్తి . సహాయం అవసరమైన ఎవరికైనా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు.
 

click me!

Recommended Stories