పీడకలలతో రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా? ఇలా చేస్తే మీరు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా పడుకుంటారు..

First Published | Sep 28, 2023, 9:39 AM IST

కంటి నిండా నిద్రపోతేనే ఉదయం రీఫ్రెష్ లేస్తాం. పనులను చకాచకా చేస్తాం. కానీ కొంతమందికి పీడకలల వల్ల కంటిమీద కునుకే ఉండదు. జ్యోతిష్యం ప్రకారం.. దిండుకింద కొన్ని వస్తువులను పెడితే మీరు హాయిగా నిద్రపోతారు. 

bad dreams

కలలు  రావడం చాలా చాలా సహజం. జీవితంలో కలలు రానివారంటూ ఉండరు. అయితే కొంతమందికి ఎప్పుడో ఒక సారి కలలు పడుతుంటే.. ఇంకొంతమందికి మాత్రం రోజూ పడుతుంటాయి. అవి కూడా భయంకరమైన పీడకలలు. ఏదో ఘోరం జరుగబోతుందంటూ కలలు పడుతుంటాయి. ఇలాంటి భయకరమైన కలల వల్ల ఏదో జరగబోతుందన్న భయం పట్టుకుంటుంది. ఇంకేముంది దీనివల్ల అస్సలు నిద్రేరాదు. కానీ రాత్రిళ్లు నిద్రపోకపోవడం వల్ల ఎన్నో మానసిక, శారీరక సమస్యలు వస్తాయి. చెడు లేదా భయంకరమైన కలలు రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇలాంటి కలలు పడేవారు దిండుకింద కొన్ని వస్తువులను పెట్టుకుంటే మీరు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోతారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అల్లం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులను దిండు కింద పెడితే పీడకలలు మొత్తమే పడవు. రోజూ పీడకలలో నిద్రకు దూరమైన వారు పడుకునే ముందు ఒక చిన్న గుడ్డలో కొంచెం అల్లం ముక్కను చుట్టి దిండుకింద పెట్టుకుని పడుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల పీడకలలు పడవని నమ్ముతారు. 


యాలకులు

యాలకులు కూడా చెడు కలలు పడకుండా ఆపగలవు. మీరు భయంకరమైన కలలు రోజూ పడుతుంటే.. మీరు పడుకోవడానికి ముందే ఒక చిన్న గుడ్డను తీసుకుని అందులో 5-6 చిన్న యాలకులను వేసి కట్టండి. దీన్ని దిండుకింద పెట్టుకుని పడుకోండి. జ్యోతిష్యం ప్రకారం.. ఇలా చేయడం వల్ల చెడు కలలు రావు. అలాగే రాత్రిళ్లు మీరు ప్రశాంతంగా పడుకుంటారు కూడా. 
 

పసుపు ముద్ద

ఎప్పుడూ పీడకలలు, కంటిమీద కునుకు లేకుండా చేసే కలలు పడుతుంటే.. మీరు నిద్రపోయే ముందు ఈ పనిని ఖచ్చితంగా చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీరు నిద్రపోవడానికి ముందు పసుపు ముద్దను చిన్న గుడ్డలో కట్టి మీ దిండు కింద పెట్టి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు బాగా నిద్రరావడమే కాకుండా ఉద్యోగం, వ్యాపారం మొదలైనవాటిలో మంచి విజయం సాధిస్తారు.
 

sleeping

ఆరోగ్యం బాగుంటుంది

ప్రతి ఒక్కరూ నిద్రపోవడానికి ముందు ఖచ్చితంగా నీళ్లను తాగాలి. నీరు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది.  అయితే మోతాదులోనే తాగాలి. అలాగే వాష్ రూం కు వెళ్లిన తర్వాత మీ పాదాలను ఖచ్చితంగా కడుక్కోండి. అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. దీనివల్ల మీ జీర్ణవ్యవస్థను బలోపేతం అవుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. 
 

Latest Videos

click me!