bad dreams
మన జీవితంలో డ్రీమ్ సైన్స్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. కొందరికి రోజూ కలలు పడుతుంటే.. మరికొందరికి అపుడప్పుడు కలలు పడుతుంటాయి. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మన కలలో కొన్ని వస్తువులను చూడటం శుభప్రదంగా, మరికొన్ని వస్తువులను చూడటం అశుభంగా పరిగణిస్తారు. అయితే మనం వీటినెప్పుడూ చూడకూడదు అనే వాటిని కూడా కలలో చూస్తుంటాం. వీటిలో గబ్బిలాలు ఒకటి. అయితే జ్యోతిషశాస్త్రంలో గబ్బిలాలను చూడటం అశుభంగా భావిస్తారు. మరి దీనిని కలలో చూడటం గురించి జ్యోతిష్యం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
bad dreams
గబ్బిలాల దాడి..
కలలో గబ్బిలాలు కనిపించడం అశుభంగా భావిస్తారు. అయితే కలలో మిమ్మల్ని గబ్బిలాలు దాడి చేయడం చెడుగా భావించాలంటున్నారు జ్యోతిష్యులు. మీకు ఈ కల పడితే మీరు ఏదో చెడు వ్యసనానికి బలైపోతారని అర్థం వస్తుంది. అంతేకాదు ఒక వ్యక్తి గురించి మీరు చెడుగా అనుకునే అవకాశం కూడా ఉంది.
కలలో గబ్బిలాలను చూస్తే..
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మీ కలలో మీరు గబ్బిలాలను చూసినట్టేతై మీకేదో చెడు జరగబోతుందని అర్థం వస్తుంది. ఈ కల చెడు సంకేతమంటున్నారు జ్యోతిష్యులు. ఇలాంటి కల మీరు భవిష్యత్తులో జరిగే అశుభ ఘటనల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం వస్తుంది.. ఈ కల మిమ్మల్ని ఒక పెద్ద భయం చుట్టుముట్టిందని సూచిస్తుంది. దీని గురించి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
Bats
గబ్బిలాల గుంపును చూస్తే..
మీరెప్పుడైనా మీ కలలో గబ్బిలాల గుంపును చూసారా? అయితే మీ విధి మిమ్మల్ని విడిచిపెట్టబోతోందని అర్థం చేసుకోండి. అలాగే ఈ కల మీకు అస్సలు మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలాంటి కలను చూసిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ కల మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో నష్టపోవడాన్ని సూచిస్తుంది.