వార ఫలాలు : 29-10-2023 నుండి 04-11-2023 వరకూ
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ... ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఈ రాశి వారికి ఈ వారం చతుర్దాది పతి అయిన చంద్రుడు జన్మ రాశి లో మరియు తృతీయ స్థానము లో సంచారం.ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు. తలపెట్టిన కార్యాలలో మిత్రుల సహాయ సహకారాల తోటి పూర్తి చేయగలుగుతారు . ఉద్యోగ సంబంధమైన విషయాలలో మంచి మార్పులు రాగలవు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన అభివృద్ధి ఆలోచనలు గూర్చి బంధుమిత్రులతో కలిసి చర్చిస్తారు. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు పొందుతారు.వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు లభిస్తాయి. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. మొండి బాకీలు లౌక్యం తో వసూలు చేసుకోవాలి.విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగాలలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. సహోదర సహోదరీ వర్గం తో తత్ సంబంధాలు బలపడతాయి.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మిత్రుల యొక్క ఆదరణ అభిమానులు పొందగలరు.ఆర్థిక మరియు కుటుంబ విషయాలలో అభివృద్ధి కనబడుతుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
ఈ రాశి వారికి ఈ వారం తృతీయాధిపతి అయిన చంద్రుడు వ్యయస్థానం మరియు ధన స్థానము లో సంచారము.ఈ సంచారము వ్యతిరేక ఫలితాలు కలుగును. అనుకోని కారణాల చేత సమాజము నందు మీ పరపతి తగ్గును. ఆత్మీయులు తో మనస్పర్ధలు ఏర్పడతాయి. సమస్యలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవలెను.నిష్కారణమైన తగాదాలు కలహాలు ఏర్పడవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. గృహము లో మరియు సంతానము తో ప్రతికూలత వాతావరణం. ఆర్థిక ఇబ్బందులు ఉన్న తగు సమయానికి ఏదో ఒక రకంగా ధనం లభిస్తుంది. మిత్రుల వలన కొంత పెడదోవ పెట్టే అవకాశం. కోర్టు కేసులు వాయిదాలు పడుతూ చిరాకు పుట్టించును. కొన్ని విషయాలలో కఠినంగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనవసరమైన సంభాషణలతో కాలయాపన చేస్తారు. ఖర్చు యందు ఆచితూచి ఖర్చు చేయవలెను. ఉద్యోగాలలో అధిక ఒత్తిడికి గురి అవుతారు.ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. సమాజము నందు ప్రతికూలత వాతావరణ. కొన్ని సందర్భాల్లో మిత్రుల వలన నష్టము కలగవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రములు
(కా-కి-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
మిథున రాశి వారికి ఈ వారం ధనాధిపతి అయిన చంద్రుడు లాభ స్థానము మరియు జన్మరాశి లో సంచారము. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందుతారు. అనుకోకుండా జరిగే సంఘటనలు మీకు లాభిస్తాయి. కొంతకాలంగా ఆగిన పనులు ఈ వారం పరిష్కారం అవుతాయి. ఉద్యోగ అభివృద్ధికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి.చేతి వృత్తి వారికి విశేష ఆదరణ లభిస్తుంది. స్థిరాస్తి వృద్ధి చేయు ప్రణాళికలు కలిసి వస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. గృహ భూ నిర్మాణ క్రయ విక్రయాలకు అనుకూలం.ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. ఉద్యోగమునందు అధికారుల అభిమానాలు పొందగలరు. అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రములు:-(హీ-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
ఈ రాశి వారికి జన్మరాశ్యాధి పతి అయిన చంద్రుడు ఈ వారం రాజ్యస్థానము మరియు వ్యయస్థానములో సంచారం .ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపంలోకి తీసుకొని వస్తారు .ఇంటా బయట మీదే పే చేయగా ఉంటుంది. వృత్తి వ్యాపారములలో ఉన్నటువంటి చికాకుల తొలగి లాభసాటిగా ముందుకు సాగుతారు. తీర్పులు మీకు అనుకూలంగా ఉండును. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. విద్యార్థులకు విద్యాసంబంధమైన విషయాలు అనుకూలం. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. కుటుంబ అభివృద్ధి బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించును. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు.కుటుంబము నందు సంతోషకరమైన వాతావరణం. ఉద్యోగమునందు అధికారవృద్ధి పొందగలరు.
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మే-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
ఈ రాశి వారికి ఈ వారం వ్యయాధిపతి అయిన చంద్రుడు భాగ్యస్థానం మరియు లాభ స్థానములో సంచారం.ఈ సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగును.ముఖ్యమైన విషయాలలో పెద్దల యొక్క సూచనలు తీసుకున్నట మంచిది. శ్రమకు తగ్గిన గుర్తింపు లభించడం కష్ట తరముగా నుండును. సహోదర సహోదరి వర్గముతో నిష్కారణంగా విభేదాలు రాగలవు . కోర్టు తీర్పులు వలన మానసిక ఒత్తిడులు పెరుగుతాయి . కుటుంబంలో ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని దీర్ఘాలోచన చేసిన పరిష్కార మార్గాలు దొరుకును . పనులు ఓర్పు సహనం తోటి చేయవలెను. సమాజంలో అపనిందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితి . ఉద్యోగాలలో అధికారుల తో విరోధాలు ఏర్పడవచ్చును. జీవిత భాగస్వామి తో సఖ్యతగా మెలగవలెను. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి ఆలోచనలు చేస్తారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగమనందు అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఢ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఈ రాశి వారికి ఈ వారం లాభాధిపతి అయిన చంద్రుడు అష్టమ స్థానము మరియు రాజ్యస్థానము లో సంచారం. ఈ సంచారం వలన ప్రతికూల ఫలితాలు కలుగును. పగ ప్రతీకారాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాల్లో లాభాలు కష్టపడి సాధించవలసిన పరిస్థితి. కుటుంబము నందు ప్రశాంతత లోపించకుండా జాగ్రత్తలు తీసుకొని వలెను. చిన్న కారణం పెరిగి పెద్దదై భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు. ఉద్యోగపరంగా కొన్ని చికాకులు తప్పవు. సంతాన అభివృద్ధికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. సంఘములో పరిస్థితులు మనోవేదనకు కారణం అవుతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును. ఆదాయ మార్గాలు తగ్గును. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు.ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. చేయు ఖర్చులు ఆచూతూచి చేయవలెను.ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. పరామర్శ చేయవలసి వస్తుంది.మానసిక ఆవేదన వ్యక్తం చేస్తారు. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రే-రో-త-తీ-తూ-తే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
ఈ రాశి వారికి ఈ వారం రాజ్యాధిపతి అయిన చంద్రుడు కళత్ర స్థానము మరియు భాగ్యస్థానములో సంచారం. ఈ సంచారం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. గృహములో శుభ కార్యక్రమాలు జరుగును. కుటుంబ విషయాల్లో సంతృప్తిని పొందుతారు. నూతన వస్తు వస్త్రాభరణం కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యలను నుండి బయట పడతారు. మిత్రులతో కలిసి ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయ మార్గాలు పెరుగును. సామాజిక జీవనం గౌరవప్రదంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య అపార్థాలు తొలగి అన్యోన్యత పెరుగుతుంది.సమస్యల నుండి బయట పడతారు.రావలసిన ధనము కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైన చివరకు లభిస్తుంది. ఉద్యోగాలలో ఉన్నత స్థితి పొందగలరు. సంతోషకరమైన వార్తల వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. చేపట్టిన కార్యాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఈ రాశి వారికి ఈ వారం భాగ్యాధిపతి అయిన చంద్రుడు శత్రు స్థానం మరియు ఆయుః స్థానంలో సంచారము. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదర అభిమానములు లభించును. విద్యార్థులకు నూతన విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అగును. గృహములో శుభకార్యములు జరుగును. వృత్తి వ్యాపారములలో ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభించును. అభివృద్ధి కార్యక్రమాల ఆలోచనలు ఫలిస్తాయి. వచ్చిన అవకాశాల్ని అశ్రద్ధ చేయకుండా అందిపుచ్చు కొనవలెను. సంఘములో గౌరవ ప్రతిష్టలు పెరుగును. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.గత కొద్దిరోజులుగా ఉన్న అనారోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజము నందు ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో పనులు సజావుగా పూర్తి చేయగలుగుతారు.
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
చంద్రుడు పంచమ స్థానము మరియు కళత్ర స్థానము లో సంచారము. ఈ సంచారము వలన వ్యతిరేక ఫలితాలు రాగలవు. మానసికంగా భయంగా ఉండుట. వృత్తి వ్యాపారాలు మందంగా నడుచును. ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ అవసరము.తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అగును . సమాజములో ఆచితూచి మాట్లాడవలెను.శారీరక బాధలు రాగలవు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో ప్రతికూలత వాతావరణం. విరోధాలకు కలహాలుకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు మానసిక ఉద్రేకతులకు దారి తీయను. స్థిరాస్తి విషయాలు ప్రతికూలంగా ఉంటాయి.విద్యార్థులు చదువులో శ్రద్ధ వహించవలెను. వృత్తి ఉద్యోగంలో అనుకూలతలు తక్కువ. సమస్యాత్మక అంశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.చేయు కార్యాలలో నిరాశ స్పృహలకు గురి అవుతారు. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. వ్యవహారమంతా తికమకగా ఉండును.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
మకర రాశి వారికి ఈవారం కళత్రాధిపతి అయిన చంద్రుడు చతుర్థ స్థానము మరియు శత్రు స్థానం నందు సంచరించిను. ఈ సంచారం వలన ఇబ్బందులు కలుగును. మానసికంగా భయాందోళన గా ఉంటుంది. చేయు పనులలో బుద్ధి కుశలత తగ్గును. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. పనులలో శారీరక శ్రమ పెరిగి బలహీనత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి తో మాట పట్టింపులు రాగలవు. ఆదాయానికి మించి ఖర్చులు చేయవలసి వస్తుంది. వ్యవహారములలో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి . నిరాశ నిస్పృహలకు గురి అవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో పెద్దల సూచనలు తీసుకొనివలెను.ఆరోగ్య విషయాలులో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి తో అకారణంగా మనస్పర్ధలు రాగలవు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.తలపెట్టిన కార్యాలలో ప్రతిబంధకాలు ఏర్పడగలవు. కుటుంబవనందు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ఈ రాశి వారికి ఈ వారం షష్ఠమాధిపతి అయిన చంద్రుడు తృతీయ స్థానము మరియు పంచమస్థానం నందు సంచరించును. ఈ సంచారం వలన అనుకూల శుభ ఫలితాలు పొందగలరు. నూతన వస్తు ఆభరణాలు లభించును. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ వారం లాభసాటిగా ఉంటుంది. శారీరకంగా మానసికంగా బలపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘము లో మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. తలపెట్టిన కార్యాలు విజయం చేకూరుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం కలుగుతుంది.కుటుంబ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. కీలక సమస్యల్లో సమయస్ఫూర్తి తో వ్యవహరించాలి. ప్రభుత్వ సంబంధిత పనుల్లో అవాంతరాలు ఏర్పడుతాయి. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది.ధైర్య సాహసాలతో కీలకమైన సమస్యలను పరిష్కరించుకుంటారు.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఈ రాశి వారికి ఈ వారం పంచమాధిపతి అయిన చంద్రుడు ధన స్థానము మరియు మాతృ స్థానము లో చంద్రసంచారం. ఈ సంచారము వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. అనవసరమైన ఖర్చులు పెరుగును. కుటుంబ కలహాలు రాగలవు. సమస్యల్లో తొందరపాటు నిర్ణయాలు లేకుండా సమస్యలను చక్క పెట్టవలెను. వాద ప్రతివాదములకు దూరంగా ఉండడం మంచిది. కొన్ని సంఘటనలు వలన ఉద్రేకం మానసిక ఆవేదన పెరుగును. మిత్రులతో కలహాలు ఏర్పడవచ్చు. ఆకస్మిక పరిణామాలు కలిగి ఆందోళన కలిగిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ప్రతిబంధకాలు ఏర్పడగలవు. ఉద్యోగాలలో అధికారులతో మనస్పర్ధలు . వృత్తి వ్యాపారాల్లో ధన నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికంగా సామాజికంగా బలహీనపడతారు.సమాజం నందు అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు పుట్టించును.