Mangalsuthra
హిందూమతంలో మంగళసూత్రాన్ని, సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక మహిళకు పెళ్లైందన్న సంగతిని ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం, కాలి మెట్టెలు, సూధూరమే చెప్తాయి. ముఖ్యంగా మంగళసూత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే చాలా మంది తెలిసో తెలియక కొన్ని మంగళ సూత్రానికి సంబంధించిన కొన్ని పొరపాట్లను చేస్తుంటారు. కానీ దీనివల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు మంగళ సూత్రానికి సంబంధించిన ఎలాంటి పొరపాట్లను చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Mangalsutra
మంగళసూత్రం ప్రాముఖ్యత
వివాహిత స్త్రీలకు మంగళసూత్రం చాలా ముఖ్యమైందిగా భావిస్తారు. మంగళసూత్రం భార్యాభర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇది భార్యాభర్తల అనుబంధాన్ని తెలియజేస్తుంది. అందుకే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అసలు మంగళసూత్రానికి సంబంధించి ఎలాంటి పొరపాట్లు చేయకూడదంటే?
వేరొకరి మంగళసూత్రం ధరించకూడదు
పలు నమ్మకాల ప్రకారం.. వేరొక మహిళ మంగళసూత్రాన్ని ఎప్పుడూ కూడా ధరించకూడదు. అసలు ఇలా ధరించడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల బంధం బలహీనపడుతుందట.
మంగళసూత్రం ధరించకపోవడం
పెళ్లి అయిన నాటి నుంచి భర్త ఉన్నంత వరకు ప్రతి మహిళ మంగళసూత్రాన్ని ఖచ్చితంగా ధరించాలి. కానీ ట్రెండ్ ను ఫాలో అయ్యే ఆడవారు మాత్రం మంగళ సూత్రాన్ని తీసేసి వెళుతుంటారు. కానీ ఇలా అస్సలు మంచిది కాదు. పెళ్లైన ఆడవారి మెడ ఖాళీగా ఉంచకూడదని నమ్ముతారు.
Mangalsuthra
ఇలాంటి మంగళసూత్రం ధరించకూడదు
మంగళసూత్రం ముత్యాలు విరిగిపోతే మెడలో వేసుకోకూడదని పెద్దలు చెప్తున్నారు. ఇలాంటి మంగళసూత్రం మీ మెడలో ఉంటే దాన్ని వెంటనే మార్చండి. ఎందుకంటే మెడలో విరిగిన మంగళసూత్రం ధరించడం మంచిది కాదు.
Mangalsutra
విభేదాలు
మంగళసూత్రానికి సంబంధించిన ఈ తప్పులు చేస్తే మాత్రం భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండరు. అందుకే మీరు ఈ పొరపాట్లను అస్సలు చేయకండి. మంగళసూత్రాన్ని అన్ని రోజుల్లో కొనకూడదని జ్యోతిష్యులు చెప్తారు. మంగళ సూత్రాన్ని కొనడానికి సోమవారం, గురువారం, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
దుష్ట కంటి నుంచి రక్షిస్తుంది.
మంగళసూత్రంలో బంగారం, నల్ల ముత్యాలను ఉపయోగిస్తారు. ఈ నల్ల ముత్యాలు భర్తను దుష్ట దృష్టి నుండి రక్షించడానికి కూడా పనిచేస్తాయిని జ్యోతిష్యులు చెబుతున్నారు.