Your Weekly Horoscopes: ఓ రాశివారికి వారం ఆఖరులో ధనలాభం, కుటుంబ జీవితం ఆనందం

First Published Mar 17, 2024, 10:00 AM IST

Your Weekly Horoscopes: ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు.ఉద్యోగాలలో సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.అన్ని వర్గాల వారు ఉత్సాహవంతంగా ఉంటారు. 


వార ఫలాలు :17-03-24  నుండి  23-03-24 వరకు

జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

మిశ్రమ ఫలితాలు ఉంటాయి.శారీరక బాధలు పెరుగుతాయి.అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థిక వ్యవహారాల్లో నియంత్రణ అవసరం.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం.వ్యాపారంలో మార్పు లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేస్తారు.వ్యాపారంలో ఆదాయం తగ్గడం మరియు ఖర్చు పెరగడం జరుగుతుంది.విద్యార్థులకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది.బద్ధకం వలన చదువు పై ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవటం.పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి వీలైనంత ఎక్కువ కృషి చేయడం మంచిది.అన్ని తెలుసు అనే అహంభావాన్ని విడనాడాలి

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అంతా అనుకూలంగా ఉంటుంది.చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు.వృత్తి లో మరియు వ్యక్తిగతంగా అభివృద్ధి సాధ్యమవుతుంది.కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది.తోబుట్టువుల లేదా స్నేహితుల సహాయం అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం బాగుంటుంది.ఇతరులు కూడా మీ సలహాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు కొంత చేతికి అందుతుంది.బంధు వర్గము తో ఉన్న విభేదాలు పరిష్కారం కాగలవు.క్రమం సక్రమంగా అన్నిటిలోనూ మంచి మార్పులు రాగలవు.నూతన వస్తు వాహనాలు ఏర్పరుచుకుంటారు.

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
వివాదాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.సోదరులతో చిన్నపాటి విభేదాలు రాగలవు.సంతాన విషయంలో శ్రద్ధ అవసరం.ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవగలవు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారాలు  అంతంత మాత్రంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి.అవసరములకు సమర్ధించు కొను ఆదాయం లభిస్తుంది.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు.ఉద్యోగాలలో సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.అన్ని వర్గాల వారు ఉత్సాహవంతంగా ఉంటారు. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు పొందగలరు.ప్రయత్న పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.ఇంటా బయట పరిస్థితిలు అనుకూలిస్తాయి.వ్యాపారాలు  పుంజుకుంటాయి.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
వ్యాపారంలో అనుకున్న లాభాలు పొందగలరు.ఉద్యోగులకు అనుకూలమైన కాలం. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.చాలా కాలంగా పూర్తికాని పనులు చిన్న ప్రయత్నం తో పూర్తి చేస్తారు.రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది.వ్యాపారంలో మీ అంచనాలు నిజమవుతాయి.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యక్తిగతమైన విమర్శలకు దూరంగా ఉండాలి.కోపాన్ని అదుపు చేసుకొని వ్యవహరించాలి.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగు వచ్చు.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.దూరప్రయాణాలు వీలైనంత వాయిదా వేయడం మంచిది.కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో ప్రతికూలత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి నిదానముగా సాగుతాయి.ఉద్యోగాలలో అధికారులు తో వివాదాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.దీర్ఘకాలిక రుణాలు నుంచి ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు.గృహంలో ఎవరి తీరు వారిదిగా ఉంటుంది.

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఉద్యోగాలలో అధికారులు తో నూతన సమస్యలు రాగలవు.ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు లో ఆశించిన రీతిలో లాభాలు లభించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు రాగలవు.ఆరోగ్య సమస్యలు రాగలవు.ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉంటుంది.నష్టం పరమైన ఆలోచనలు అధికంగా చేస్తారు.చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.ప్రయత్న కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి.ఉద్యోగాలలో అంకితభావం చూపాలి.

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అన్ని వర్గముల వారు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతారు.నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి.శత్రు నాశనం ఆనందాన్ని కలిగిస్తుంది.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆర్థికంగా అన్ని విషయాలు కలిసి వస్తాయి.వ్యాపార వ్యవహారాలు లాభ పూరితంగా ఉంటాయి.అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి కాగలవు.నూతన బాధ్యతల వల్ల గౌరవం హోదా పెరుగుతుంది.చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు.గృహ భూ వివాదాల నుంచి బయటపడతారు. ఇంటా బయట అనుకూలమైన వాతావరణం.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.సమయానుకూలంగా వ్యవహరించడం మంచిది.

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ధన వ్యవహారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు.బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సంతానపు అవసరాల నిమిత్తం ధనాన్ని ఖర్చు చేస్తారు.

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
వ్యాపారం లాభదాయకంగా అనిపించినా జాగ్రత్త అవసరం.వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి చికాకులు అధికమవుతాయి.సాధ్యమైన మేరకు తక్కువ మాట్లాడటం మంచిది.ఆర్థికంగా ఖర్చులు నియంత్రించాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.అనవసరమైన ఖర్చులు పెరిగి మానసిక ఆందోళన పెరుగుతుంది.కుటుంబంలో పెద్దవారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరమైన జీవితంలో మిశ్రమ ఫలితాలను పొందగలరు.విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి.వైవాహిక జీవితంలో చిన్నపాటి చిరాకులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి సమస్యలు తప్పవు.ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
చేపట్టిన ప్రతి పనిలో కొన్ని అడ్డంకులను ఎదుర్కుంటారు.ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.సహోద్యోగుల నుంచి మద్దతు తక్కువగా ఉంటుంది. అపార్థం లేదా అవసరం సమస్యలుంటాయి.జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడే అవకాశం.ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది.వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.అధిక వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం.కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది.గృహ భూ క్రయ విక్రయాలు విషయంలో జాగ్రత్త అవసరం. వాహన ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రతి పనిలోనూ సహనంగా వ్యవహరించడం వలన ఆటంకాలు తొలగి పనులు ముందుకు సాగ గలవు.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈ రాశి వారికి పంచమాధిపతి అయిన చంద్రుడు ఈవారం
శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి.వృత్తిరీత్యా ఇబ్బందులు తొలగుతాయి.అన్ని వ్యవహారాల్లో అందరి సహకారం లభిస్తుంది.ఉద్యోగులకు వృత్తి నైపుణ్యం పెరుగుతుంది.మీ పనితీరును అధికారులు ప్రశంసిస్తారు.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆర్థిక సంబంధమైన నష్టాలు తగ్గుముఖం పడతాయి.కుటుంబ పరమైన చికాకులు తగ్గి ప్రశాంతత లభిస్తుంది.ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.జీవిత భాగస్వామితో సఖ్యత గా వ్యవహరిస్తారు. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి.భూ గృహ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు.సమాజంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది.ఆకస్మిక ధనలాభం
 

click me!