Astrology: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు సంబంధించిన దోషాలను తొలగించడానికి చాలా పరిహారాలు చెప్పబడ్డాయి, బూట్ల దానం కూడా వాటిలో ఒకటి. బూట్లను ఎవరికి దానం చేయాలి, ఏ రంగు బూట్లను దానం చేయాలి?
Astro Tips: హిందూ ధర్మంలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల గ్రహాలకు సంబంధించిన దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిషులు చెబుతుంటారు. కోరికలు నెరవేరడానికి కూడా జ్యోతిష శాస్త్రంలో దానానికి సంబంధించిన చాలా పరిహారాలు చెప్పబడ్డాయి. సాధారణంగా అయితే ఆవులు లేదంటే గోధుమలు, నువ్వులు, బియ్యం, బెల్లం, వస్త్రాలు దానం చేయాలని చెబుతుంటారు.
25
షూస్ లేదా చెప్పుల దానం...
అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో బట్టలు, బూట్లు లేదా చెప్పులు లాంటివి కూడా దానం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా శుభ ఫలితాలు పొందడం సాధ్యమవుతుందని ఉజ్జయిని జ్యోతిష్కులు పండిత్ నలిన్ శర్మ చెబుతున్నారు. ఆయన ప్రకారం బూట్ల దానం ఎప్పుడు, ఎవరికి చేయాలో తెలుసుకుందాం. దాని లాభాలు ఏంటో కూడా చూద్దాం...
35
బూట్ల దానం ఎప్పుడు చేయాలి?
జ్యోతిషులు పండిత్ శర్మ ప్రకారం... ఒక వ్యక్తిపై శని చెడు ప్రభావం ఉన్నప్పుడు అంటే ఏలినాటి శని వంటి పరిస్థితుల్లో బూట్లు దానం చేయాలి. ఇలా చేస్తే శని ప్రభావం తగ్గి కష్టాల నుండి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. శని చెడు ప్రభావం కొంత తగ్గి, సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది కాకుండా ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, వారి ఉత్తర కర్మలు చేసేటప్పుడు కూడా బ్రాహ్మణుడికి బూట్ల దానం చేసే విధానం ఉంది.
జ్యోతిషులు పండిత్ శర్మ ప్రకారం... మీరు శని చెడు ప్రభావం నుండి తప్పించుకోవడానికి బూట్లు-చెప్పులు దానం చేయాలనుకుంటే ఈ దానం ముఖ్యంగా కుష్టురోగులకు చేయాలి. బూట్లు-చెప్పుల రంగు నలుపుగా ఉండాలని కూడా గుర్తుంచుకోండి. కుష్టురోగులు అందుబాటులో లేకపోతే, అవసరమైన ఏ ఇతర వ్యక్తికైనా బూట్ల దానం చేయవచ్చు. కానీ అవసరం లేని వారికి బూట్ల దానం చేయకూడదని గుర్తుంచుకోండి. దానివల్ల ఎలాంటి శుభ ఫలితం ఉండదు.
55
బూట్ల దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
జ్యోతిషులు పండిత్ శర్మ ప్రకారం... జ్యోతిషంలో బూట్ల దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత చెప్పబడింది. ఎందుకంటే శని ప్రభావం వ్యక్తి కాళ్లపై ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. ఒక వ్యక్తిపై శని చెడు ప్రభావం ఉన్నప్పుడు సమస్యలు లేదా వ్యాధులు వస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు అవసరమైన వారికి బూట్లను దానం చేసినప్పుడు, శని దేవుడు సంతోషించి, తన అనుగ్రహాన్ని అందిస్తాడు.
గమనిక :
ఈ ఆర్టికల్‌లోని సమాచారం పండితులు, జ్యోతిషుల నుండి తీసుకోబడింది. మేము ఈ సమాచారాన్ని మీకు చేరవేసే మాధ్యమం మాత్రమే. వినియోగదారులు ఈ సమాచారాన్ని కేవలం సూచనగా మాత్రమే పరిగణించాలి.