Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశులవారికి అంతర్ దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను వీరు ముందే ఊహించగలరు. ఎదుటివారి మనసులో ఏముందో కూడా సులభంగా కనిపెట్టగలరు. మరి అలాంటి శక్తి ఉన్న రాశులేవో తెలుసుకుందామా..
సాధారణంగా మనందరికీ ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశులవారికి అంతర్ దృష్టి శక్తి అద్భుతంగా ఉంటుంది. జరగబోయే సంఘటనలను వీరు ముందుగానే పసిగడతారు. తమ చుట్టూ ఉన్న వారి నిజ స్వరూపాలను కూడా అర్థం చేసుకోగలరు. మంచి స్నేహితులు ఎవరో, శత్రువులు ఎవరో సులభంగా గుర్తించగలరు. వీరి దగ్గర అబద్ధం చెప్పడం అసాధ్యం, ఎందుకంటే వీరు క్షణాల్లో అబద్ధాన్ని పసిగట్టేస్తారు. మరి అలాంటి శక్తి కలిగిన రాశులేవో తెలుసుకోండి.
25
మీన రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీన రాశికి అధిపతి గురు గ్రహం. ఇది జల తత్వానికి చెందిన రాశి. ఈ రాశి వారు స్వభావరీత్యా చాలా సున్నితంగా, ఊహాశక్తితో ఉంటారు. వీరి మనసులోకి అకస్మాత్తుగా వచ్చే ఆలోచనలు లేదా కలలు ఎక్కువశాతం నిజమవుతాయి. వీరు ఇతరుల ఆలోచనలను, భావాలను సులభంగా చదివేయగలరు. అందుకే వీరి ముందు ఏ అబద్ధం పనిచేయదని పండితులు చెబుతున్నారు.
35
కర్కాటక రాశి
కర్కాటక రాశికి చంద్రుడితో సంబంధం ఉంటుంది. చంద్రుడిని మనస్సు, భావోద్వేగాలకు అధిపతిగా చెబుతారు. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు తమ చుట్టూ జరిగే చిన్న మార్పులను కూడా వెంటనే గ్రహిస్తారు. ఎవరి ప్రవర్తనలో మార్పు అయినా లేదా రాబోయే ముఖ్యమైన కుటుంబ కార్యక్రమం అయినా, కర్కాటక రాశి వారు దాన్ని ముందే పసిగడతారు. వీరి సిక్స్త్ సెన్స్ చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత రహస్యమైన రాశులలో వృశ్చిక రాశి ఒకటి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారు లోతైన ఆలోచనాపరులు. ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకునే అద్భుతమైన కళ వీరికి ఉంటుంది. వీరి సిక్త్స్ సెన్స్ చాలా బలంగా ఉంటుంది. చాలాసార్లు వీరు ఎలాంటి ఆధారం లేకుండానే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ నిర్ణయమే సరైనదని రుజువవుతుంది.
55
ఈ రాశులకే ఎందుకు స్ట్రాంగ్ సిక్త్స్ సెన్స్?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీన, కర్కాటక, వృశ్చిక రాశులు జల రాశులు. జల తత్వం అనేది భావోద్వేగాలు, సున్నితత్వం, ఆధ్యాత్మిక శక్తితో ముడిపడి ఉంటుంది. అందుకే ఈ రాశుల వారు సూక్ష్మమైన సంకేతాలను సులభంగా గ్రహించగలరు. ఇతరుల కంటే మెరుగ్గా భవిష్యత్ సంఘటనలను అంచనా వేయగలరు.