Astrology Prediction: జనవరి 2022 ఓ రాశివారికి విపరీతమైన ధనాదాయం..!

First Published Jan 1, 2022, 5:46 AM IST

ఈ నూతన సంవత్సరంలోని జనవరి మాసంలో  ఓ రాశివారికి ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. సమాజహితమైన పనులు తలపెడతారు. కుటుంబ సభ్యుల మధ్య బలవంతంగా కాలం గడిపెదురు

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెలలో కొద్దిపాటి చికాకులు, గృహ లేదా భూ సంబంధమైన నష్టం పొందుటకు అవకాశం ఉన్నది. ఆర్జించిన ధనం నిలువదు. ఉద్యోగ జీవనంలో అఖస్మిక ఉద్యోగ నష్టములు. పనిభారం కూడా పెరుగుతుంది. కుటుంబ పరమైన ఖర్చులు అదుపు తప్పుతాయి.   ద్వితియ వారంలో కుటుంబ సభ్యులలో ఒకరికి శస్త్ర చికిత్స లేదా అనారోగ్యం వలన ఆందోళన ఎదురగును. తదనుకూల ధన వ్యయం. శ్రమ అధికమగును.మిత్రుల సహకారం కొంత వరకు లభించుట వలన ఉపశమనం లభించును. ముఖ్యంగా 27, 28, 29 తేదీలు అనుకూలం కాదు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 


వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ నెలలో మంచి ఫలితాలను కలిగించును. తలపెట్టిన కార్యములందు జయం వరించును. తలచిన పనులు సకాలంలో పూర్తి చేయగలరు. ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. సమాజహితమైన పనులు తలపెడతారు. కుటుంబ సభ్యుల మధ్య బలవంతంగా కాలం గడిపెదురు. అవకాశములు తక్షణం వినియోగించుకోనుట అవసరం. నిర్దిష్టమైన ఇష్ట అయిష్టాలను ప్రదర్శించుట వలన మాట పడతారు. మాసాంతంలో ఉద్యోగులకు  పై అధికారుల సహకారం వలన ఆశించిన వృద్ధి లభించును.వ్యాపారములలో చక్కటి ధనప్రాప్తి లభించును.  స్త్రీ సంతానం వలన సంతాన సౌఖ్యం పొందేదురు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ నెలలో వ్యాపార రంగంలోని వారికి అఖండ విజయం లభించును. నూతన వ్యాపారముల ద్వారా చక్కటి ధన ఆర్జన చేయుదురు. ఈ మాసంలో ధన సంపాదన పెరుగును. ఉద్యోగ జీవనంలోని వారికి మిశ్రమ ఫలితాలు. పై అధికారులతో మాట పడుదురు. శ్రమకు తగిన ఫలితం వుండదు. పోటీదారుల వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. ప్రధమ, ద్వితియ మరియు తృతీయ వారములు సామాన్య ఫలితాలు ఏర్పరచును. మాసాంతంలో ఒక ముఖ్య వ్యవహారం అటంకములను పొందును. జీవిత భాగస్వామితో మాట కలయికలో ఇబ్బందులు ఎదురగును.  ఆచారవంతమైన జీవితానికి ఆలోచనలు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూల కాలం.  గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో  సామాన్య ఫలితాలు ఏర్పడును. ఈ మాసంలో నూతన పనులు ఆరంభించకూడదు.భూ సంబంధ లేదా వారసత్వ సంబంధ చికాకులు ఎదుర్కొందురు. ద్వితియ వారంలో నూతన వస్త్ర లాభం పొందేదురు. ధనదాయంలో కూడా కొంత  పెరుగుదల లభించును. తృతీయ వారంలో కుటుంబంలో చక్కటి వాతావరణం ఏర్పడును. చివరి వారం  ప్రారంభం నుండి మాసాంతం వరకూ చేతిలో ధనం నిలువదు. వృధా వ్యయం ఎదుర్కొందురు. చికాకులు కలిగించే మరియు ప్రయోజనం లేని  ఫలించని ప్రయాణములు చేయవలసి వచ్చును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ నెలలో ఆదాయం లో కొద్దిపాటి తగ్గుదల ఎదుర్కొందురు. వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో ధన లాభం ఏర్పడదు. వడ్డీ వ్యాపార రంగంలో ధననష్టములకు అవకాశములు కలవు. మిత్ర వర్గమునకు సంభందిచిన ఒక అశుభ వార్త వినుటకు కూడా సూచన ఉన్నది. చక్కటి స్త్రీ  సంతాన ప్రాప్తి. 11వ తేదీ తదుపరి నూతన పరిజ్ఞానంలో శిక్షణ లు పొందు అవకాశం ఉన్నది. ఉద్యోగ జీవనంలో చిక్కులు తొలగుతాయి. మాసాంతంలో నూతన వ్యవహారములు ప్రారంభించుట వాయిదా వేసుకొనుట మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో ప్రేమ వ్యవహారములందు మానసిక వ్యధ ఎదుర్కొందురు. అకాల భోజనములు, శిరో బాధ మరియు  నిద్రలేమి వంటి ఇబ్బందులు ఎదుర్కొందురు. కష్టం మీద కార్య జయం లభించును. చివరి వారంలో విరామం లేకుండా పనులు కొనసాగును. మొత్తం మీద ఈ మాసంలో ఆవేశం తగ్గించుకోనిన మంచిది. శ్రమతో కూడిన ప్రయాణములు ఉన్నవి. మీ వలన ఇతరులకు ఉపకారం జరుగుతుంది. ఈ మాసంలో 13,14,15 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో అంత అనుకూలమైనది కాదు. పోలీసుల వలన వేధింపులు ఉండగలవు. వ్యక్తిగత విషయాల్లో మానసిక ఆందోళన అధికం అగును. మీ వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయం వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. ఈ మాసం అంతా ధనాదాయం సామాన్యం. వృత్తి వ్యాపారదులలో  ఆశించినంత అభివృద్ది ఉండదు.19, 20 వ తేదీలలో యంత్ర సంబంధమైన సమస్యల వలన ధన వ్యయం ఏర్పడు సూచన. 22వ తేదీ తదుపరి సమస్యల తీవ్రత తగ్గును. ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో అనుకూల వాతావరణం ఏర్పరచును. కష్టానికి తగిన ఫలములు పొందుతారు. మహిళలు తమ స్వ వ్యవహార దక్షతతో చాలా పెద్ద సమస్య నుండి బయట పడతారు. భాత్రు వర్గంతో అవగాహన ఏర్పడుతుంది. ఈ మాసంలో ధనానికి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య సమస్యల నుండి బయట పడతారు. వైద్యుల అభిప్రాయం తలక్రిందులు అవుతుంది. విద్యార్దులు, విదేశీ ప్రయత్నములు చేయువారికి, స్థాన చలనము నకు ప్రయత్నించు వారికి ఈ మాసం శుభకరం.  మనోవంచా ఫలసిద్ధి ఏర్పడును. పేరు ప్రఖ్యాతలు పెరుగును. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో పరిస్టితులు మెరుగుపడును. భాగస్వామ్య వ్యాపారములు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూల కాలం. మీపై వచ్చిన అభియోగాలకు, విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వగలరు. ఈ మాసంలో వ్యవహార అనుకూలత ఉంది. సంస్థల సభ్యత్వాలు తీసుకొనుట కలసి వస్తుంది. మిత్రుత్వాలు బలపడతాయి. మాస మధ్యమంలో దైవ దర్శనం, పారమార్ధిక చింతన వంటి కార్యముల వలన ఆహ్లాదకరమైన కాలం ఏర్పడుతుంది. ఈ మాసంలో ఆర్ధిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.వివాహ ప్రయత్నములకు  మధ్యమ ఫలితాలు లభించును. పుత్ర సంతానమునకు అనుకూలమైన కాలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో మిశ్రమ ఫలితాలను ఏర్పడుతాయి. వ్యాపార రంగంలో పోటీ వలన ఆదాయంలో తగ్గుదల ఏర్పడుతుంది. మాతృ వర్గీయులతో విభేదాల వలన మానసిక అశాంతి. 10,11,12 తేదీలలో విహార యాత్రలు లేదా గృహ సంతోషాలు. 22,23,24 తేదీలలో ఆరోగ్య సంబంధ ఇబ్బందులు ఎదుర్కొనుటకు సూచనలు ఉన్నవి. ఉద్యోగ మార్పు కొరకు ప్రయత్నించుట మంచిది కాదు. వైద్య రంగంలోని వారు 22 నుండి 25 వ తేదీల మధ్య కాలంలో చేసే శస్త్ర చికిత్సల్లో జాగ్రత్తగా ఉండవలెను. మొత్తం మీద ఈ మాసంలో కుటుంబ పరమైన వ్యక్తిగత జీవనంలో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ ఆర్ధికంగా అసంపూర్తి ఎదుర్కొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో నూతన పదవులు ప్రాప్తించును. గౌరవ జీవనం. అధికారుల మన్ననలు ఆనందాన్ని కలుగచేస్తాయి. వినోద సంబంధమైన వ్యయం అధికంగా చేస్తారు.ద్వితియ వారంలో సోదరీ వర్గం వారికి ఒక నష్టం లేదా వారి కొరకు ఆందోళన అనుభవిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య చర్చలు ఫలవంతం అగును. ధనాదాయం సామాన్యం. వ్యాపారములలో ప్రోత్సాహం ఉండును. ఈ మాసంలో 2,6,15, 26 తేదీలు అంత అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 


మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ నెలలో చక్కటి ఆరోగ్యం అనుభవిస్తారు. శత్రు నాశనం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్రుత్తి జీవనం లోని వారికి ఆదాయంలో పెరుగుదల ఏర్పడుతుంది. పనులలో గుర్తింపు లభిస్తుంది. గృహ నిర్మాణ పనులు పూర్తి చేస్తారు. 10 నుండి 14 తేదీల మధ్య చేయు వివాహ ప్రయత్నములు కలసి వస్తాయి. నూతన వస్తువులు అమర్చుకుంటారు జీవిత భాగస్వామితో సౌఖ్యత ఆనంద పరుస్తుంది. ఎదిగిన సంతానం అభివృద్ధిక స్తానాన్ని పొందుట సంతోషం ఏర్పరుస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

click me!