వారఫలితాలు 31 డిసెంబర్ శుక్రవారం 2021నుండి జనవరి 6 గురువారం 2022

First Published Dec 31, 2021, 8:43 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. భూములు కొనుగోలులో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం కొన్ని వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో నెలకొన్న విభేదాలు క్రమేపీ పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కొన్ని ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు  బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు అధిగమిస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబసభ్యుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగినా రుణయత్నాలు తప్పవు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో శ్రమపడాల్సివస్తుంది. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. కొత్త పరిచయాలు కాస్త ఊరటనిస్తాయి. కుటుంబసభ్యులు మీ అభిప్రాయాలను తిరస్కరించవచ్చు, అయినా మనోధైర్యం వీడవద్దు. వ్యాపార లావాదేవీలు అంతంతగానే కొనసాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త సమస్యలు తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. అందరిలోనూ ఆధిక్యతను ప్రదర్శిస్తారు. తోటి వారి సాయం తీసుకుని ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచమయవుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. మీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో చాకచక్యంగా వ్యవహరించి గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఉత్సాహంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. క్రియాశీల వ్యవహారాలలో అటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. కొన్ని ఆహ్వానాలు అంది ఆశ్చర్యపడతారు. కొన్ని కాంట్రాక్టులు దక్కుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు. రాజకీయవర్గాల చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యం మందగిస్తుంది. సోదరులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఆర్థికంగా క్రమేపీ మెరుగైన పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల ఆశలు నెరవేరతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వస్తులాభాలు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. కళారంగం వారికి నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. ఆస్తి వ్యవహారాలు పరిష్కరించుకుంటారు. సమాజ సేవలో పాలుపంచుకుంటారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు ఊహించని పదవి రావచ్చు. వారం మధ్యలో వృథా ఖర్చులు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం మీపై బంధువులు మరిన్ని బాధ్యతలు మోపవచ్చు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు వేగవంతంగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో నెలకొన్న స్థబ్దత తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. నిర్ణయాలు మార్చుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు. పారిశ్రామికవర్గాలకు కొన్ని అంచనాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ఖర్చులు అధికం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది


కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. వివాహయత్నాలు సానుకూలం. కుటుంబసభ్యులతో మరింత ఆప్యాయత, ప్రేమగా మసలుకుంటారు. భూవివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. ప్రముఖులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహకరమైన సమాచారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అనుకోని అవకాశాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. మిత్రులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ఊహలు కొన్ని నిజం చేసుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరి ఖర్చులు అధిగమిస్తారు. సంఘంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చర్చలు సఫలమవుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనసౌఖ్యం. సేవాదృక్పథంలో ముందుకు సాగుతారు. విద్యార్థులు అనూహ్యమైన విజయాలు సాధిస్తారు. వ్యాపారాలు మరింత విస్తరించి పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో అనారోగ్యం. సోదరులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య
 

click me!