Mahalakshmi Raja Yogam: కుజ, చంద్రుల కలయితో ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!

Published : Jul 17, 2026, 01:45 PM IST

Mahalakshmi Raja Yogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల కలయిక అత్యంత శుభప్రదంగా ఉంటుంది. త్వరలో కుజ, చంద్రుల కలయిక వల్ల మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారికి అపారమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశులేవో చూసేయండి.

PREV
15
కుజ, చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధైర్యం,  పరాక్రమం వంటి వాటికి కారకుడైనా కుజుడు.. మనసు, భావోద్వేగాలకు కారకుడైన చంద్రుడితో కలవనున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక ఆగస్టు 8 న జరగనుంది. దానివల్ల అత్యంత శుభప్రదమైన 'మహాలక్ష్మీ రాజయోగం' ఏర్పడనుంది. ఈ యోగం దాదాపు రెండున్నర రోజుల పాటు ఉంటుంది. ఈ రాజయోగం వల్ల నాలుగు రాశుల వారికి ప్రత్యేకంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. మరి ఆ రాశులేవో తెలుసుకోండి.

25
కుంభ రాశి

కుంభ రాశి వారికి మహాలక్ష్మీ రాజయోగం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఉద్యోగ, వృత్తి పరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగావకాశాలు రావచ్చు. పాత పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. అప్పులు తీర్చడంతోపాటు పొదుపు కూడా చేసే అవకాశం ఉంది.

35
మకర రాశి

మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో కొత్త పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. పలుకుబడి ఉన్న వ్యక్తుల మద్దతు లభిస్తుంది. తండ్రి తరపు ఆస్తికి సంబంధించి శుభవార్త అందే అవకాశం ఉంది. తండ్రితో సంబంధం మరింత బలపడుతుంది. ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది అనుకూల సమయం.

45
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి మహాలక్ష్మీ రాజయోగం వల్ల ఆదాయం పెరుగుతుంది. విదేశాలకు సంబంధించిన ప్రయత్నాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల మద్దతు పెరుగుతుంది. విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కోరికలు నెరవేరే అవకాశం ఉంది. వివిధ మార్గాల నుంచి డబ్బు రావడం వల్ల పొదుపు సామర్థ్యం పెరుగుతుంది. కుటుంబ జీవితంలోనూ సంతోషం వెల్లివిరుస్తుంది.

55
కన్య రాశి

కన్య రాశి వారికి ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా జీతం పెంపు లభించవచ్చు. విద్యార్థులకు విదేశీ విద్యకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్న టైంకి విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు, వ్యాపార విస్తరణ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడిపే వాతావరణం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories