Zodiac sign:జాగ్రత్త.. మీకు చెడుచేసేవారికే మీరు ఆకర్షితులౌతారు.!

Published : Aug 15, 2022, 03:37 PM IST

కొందరు మనకు పైకి మంచిగానే కనిపించినా.. వీలు కుదిరినప్పుడల్లా మనపై విషం చిమ్ముతూనే ఉంటారు.  మనకు తెలీకుండానే మనపై విషం చిమ్మేవారి పట్ల మనం ఆకర్షితులమౌతూ ఉంటామట. 

PREV
113
Zodiac sign:జాగ్రత్త.. మీకు చెడుచేసేవారికే మీరు ఆకర్షితులౌతారు.!

toxic relationship

మనకు జీవితంలో చాలా మంది పరిచయం అవుతుంటారు. వారిలో చాలా మంది మనకు నచ్చుతారు. కొందరు నచ్చకపోవచ్చు. అయితే.. మనకు నచ్చిన వారిలో అందరూ మంచివారే ఉండకపోవచ్చు. కొందరు మనకు పైకి మంచిగానే కనిపించినా.. వీలు కుదిరినప్పుడల్లా మనపై విషం చిమ్ముతూనే ఉంటారు.  మనకు తెలీకుండానే మనపై విషం చిమ్మేవారి పట్ల మనం ఆకర్షితులమౌతూ ఉంటామట. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశివారు ఎలాంటి వ్యక్తులకు ఆకర్షితులౌతారో ఓసారి చూద్దాం...

213

1.మేష రాశి..
ఈ రాశివారు తమ పట్ల క్రేజ్ ఎక్కువగా చూపించేవారు అంటే ముఖ్యంగా తాము ఫ్యాన్ గర్ల్, ఫ్యాన్ బాయ్ అంటూ చెప్పుకుంటూ తిరిగేవారి పట్ల ఎక్కువ ఆకర్షితులౌతారట. ఎందుకంటే వారు తమను నిత్యం ప్రశంసలతో ముంచెత్తుతూ ఉంటారని... ఎప్పుడూ తమనే అత్తుకొని తిరుగుతారని వారిని ఇష్టపడతారు.

313

2.వృషభ రాశి...
జనాలను మానిప్యూలేట్ చేసుకుంటూ బతికేస్తూ ఉంటారు కొందరు. అలాంటివారికి ఈ వృషభ రాశివారు ఎక్కువగా ఆకర్షితులౌతూ ఉంటారు. అయితే.. వారు మీ లోని సాఫ్ట్ సైడ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారని మీరు గ్రహించలేరు.
 

413

3.మిథున రాశి...
అసరాల కోసం మీ చుట్టూ తిరిగి...  మీ కోసం ఏదైనా చేస్తామని నమ్మించేవారి ని చూసి ఈ రాశివారు ఆకర్షితులౌతారు. అయితే... నిజానికి వారు మిమ్మల్ని అవసరం తర్వాత వదిలేస్తారు. ఆ విషయం మీరు తెలుసుకోలేరు.

513

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు మరీ అంత ఎమోషనల్ పర్సన్స్ కాదు. అయితే ఈ రాశివారు నార్సిసిస్టిక్ పీపుల్స్ కి ఎక్కువగా ఆకర్షితులౌతారు. ప్రపంచం మొత్తం వారి చుట్టూ తిరుగుతోంది. కాబట్టి..ఈ రాశివారు కూడా అలాంటి వారికే ఆకర్షితులౌతారు.

613

5.సింహ రాశి..
సింహ రాశివారికి ఎవరైనా ఆడంభరంగా కనపడితే.. వారి పట్ల తొందరగా ఆకర్షితులౌతారు. అయితే.. ఇక్కడ వారు మీ అవసరాలను వాళ్లు ఉపయోగించుకొని వాళ్ల అవసరాలను తీర్చుకుంటారు.
 

713

6.కన్య రాశి..
ఇతరులపై డామినేషన్ ఎక్కువగా చూపించేవారి పట్ల కన్య రాశివారు ఎక్కువగా ఆకర్షితులౌతూ ఉంటారు. ఇలాంటివారికి ఈ రాశివారు తెలీకుండానే వీరు ఆకర్షితులౌతారు.
 

813

7.తుల రాశి...
ఈ రాశివారు ఎక్కువగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడూ బాధల్లో ఉండేవారు.. తమతో బాధను పంచుకునేవారి పట్ల వీరు ఆకర్షితులౌతారు. అయితే.. వారు మిమ్మల్ని నిచ్చెనలా ఉపయోగించుకొని పైకి ఎదుగుతారు.

913

8.వృశ్చిక రాశి...

ఈ రాశివారు.. తమను చూసి అన్నీ నేర్చుకోవాలని.. తమలా ఉండాలని ఆత్రుత పడేవారి పట్ల ఈ రాశివారు ఆకర్షితులౌతూ ఉంటారు. అయితే... నిజానికి వారు.. మీ పర్సనాలిటీని కాపీ చేసి... ఇతరుల అటెన్షన్ ని గ్రాబ్ చేయాలని చూస్తారు.

1013

9.ధనస్సు రాశి...
ఈ రాశివారు.. జడ్జిమెంటల్ పీపుల్ కి ఆకర్షితులౌతారు. అయితే.. వారు మీ లోని లోపాలను ఎత్తి చూపిస్తూ.. మిమ్మల్ని తక్కువ చేయాలని చూస్తూ ఉంటారు. ఆ విషయం మీరు గమనించలేరు.

1113

10.మకర రాశి..
ఈ రాశివారు అర్థవంతమైన రిలేషన్ ని కోరుకుంటారు. అయితే.. తెలికుండానే టెంపరరీ రిలేషన్ పెట్టుకునేవారి పట్ల మీరు ఆకర్షితులౌతారు. అయితే.. వారు మిమ్మల్ని వెంటనే వదిలేసి వెళ్లిపోతారు.

1213


11.కుంభ రాశి...
ఈ రాశివారు క్రూరమైన మనస్తత్వాన్నికలిగి ఉండేవారి పట్ల ఆకర్షితులౌతూ ఉంటారు. దానిని మీరు ఛాలెంజ్ లా ఫీలౌతారు. కానీ వారు.. మీ పై కూడా ఆ క్రూరత్వాన్ని చూపిస్తారు.

1313

12. మీన రాశి...
ప్రతి విషయంలో డ్రామా క్రియేట్ చేసేవారి పట్ల ఈ రాశివారు ఆకర్షితులౌతూ ఉంటారు. అయితే... వారు మీ విషయంలోనూ డ్రామాలు చేసే అవకాశం ఉంది.

click me!

Recommended Stories