Zodiac sign: ఈ రాశులకు చెందిన పిల్లలకు రహస్యాలు ఎక్కువ..!

Published : Aug 15, 2022, 11:11 AM IST

ఈ కింద రాశుల పిల్లలు.. సీక్రెట్స్ ఎక్కువగా ఉంటాయి. వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి దాచేస్తూ ఉంటారు. అయితే.. వారు దాచే నిజాలు ప్రమాదకరంగా ఉంటే తప్ప.. మరీ భయపడాల్సిన అవసరం లేదు.

PREV
19
 Zodiac sign: ఈ రాశులకు చెందిన పిల్లలకు రహస్యాలు ఎక్కువ..!

మన చుట్టూ ఉన్నవారిలో ఏ ఒక్కరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కో మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక పిల్లల విషయానికి వస్తే.. అందరు పిల్లలు కూడా ఒకేలా ఉండరు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశి పిల్లలు... చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

29
gossip

సీక్రెట్స్ ఉంచుకోవడం లో ఎలాంటి తప్పు ఉండదు. కొందరు అన్ని విషయాలను అందరికీ చెప్పాలని అనుకోరు. నిజం చెప్పాలి అంటే.. ప్రతి ఒక్కరికీ సీక్రెట్స్ ఉంటాయి. కానీ కొందరికి మాత్రం కాస్త ఎక్కువ ఉంటాయి. ఈ కింద రాశుల పిల్లలు.. సీక్రెట్స్ ఎక్కువగా ఉంటాయి. వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి దాచేస్తూ ఉంటారు. అయితే.. వారు దాచే నిజాలు ప్రమాదకరంగా ఉంటే తప్ప.. మరీ భయపడాల్సిన అవసరం లేదు.

39
Daily Horoscope 2022 - 15

మీ పిల్లలు మీ దగ్గర నుంచి ఏదైనా విషయం దాచిపెడుతున్నారు అంటే... ఆ టాపిక్ వచ్చినప్పుడు వారి ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి. వారు కనీసం మీ కళ్లల్లోకి చూడటానికి కూడా భయపడుతూ ఉంటారు. ఈ లక్షణాలతో.. వారు మీ దగ్గర ఏ విషయమైనా దాచి పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

49

1.వృషభ రాశి..
వృషభ రాశి పిల్లలు తొందరగా మనసులో మాట బయటపెట్టరు. ఈ రాశి పిల్లలు ఎక్కువగా కంఫర్ట్ జోన్ లో ఉండటాన్ని ఇష్టపడతారు. తొందరగా మనసులో మాట బయట పెట్టలేని మనస్తత్వం కావడంతో... ఈ రాశి పిల్లలకు సీక్రెట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు  ఎవరినైనా హార్ట్ ఫుల్ గా నమ్మితే తప్ప.. వీరు తమ సీక్రెట్స్ ని వారితో పంచుకోలేరు.

59

2.కర్కాటక రాశి...
కర్కాటక రాశికి చెందిన పిల్లలు చాలా ఎమోషనల్ గా ఉంటారు. అయినప్పటికీ వీరు ఎక్స్ ప్రెసివ్ కాదు. తొందరగా మనసులో మాట బయట పెట్టరు. ఎంత మనసులో ఉన్నా... వీరు ఎవరితో పంచుకోలేరు. అందుకే వీరి దగ్గర సీక్రెట్స్ ఎక్కువగా ఉంటాయి.

69

3.తుల రాశి...
తుల రాశి పిల్లలు.. చాలా ప్రశాంతంగా ఉంటారు. తమ పర్సనల్ విషయాలను వీరు తొందరగా బయట పెట్టరు. ఈ రాశివారికి ఎవైనా గాసిప్స్ షేర్ చేసుకున్నా.. వాటిని సీక్రెట్ గా ఉంచుతారు. కానీ... వాటిని బయటపెట్టరు.

79

4.వృశ్చిక రాశి...
వృశ్చిక రాశి పిల్లల్లో ఉన్న బెస్ట్, వరస్ట్ క్వాలిటీ ఏదైనా ఉంది అంటే.. అది సీక్రెట్స్ దాచిపెట్టడమే. వీరు తమ మనసులో మాట కొంచెం కూడా బయటపెట్టరు. ఎదుటివారు.. కనీసం వారు ఏమి ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని కూడా ఊహించలేరు.

89

5.కుంభ రాశి...
కుంభ రాశి వారు  చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. ఈ రాశికి చెందిన పిల్లలు..చాలా లక్ష్య సాధనతో.. గొప్ప ఆలోచనలతో ఉంటారు. ఈ రాశి పిల్లలు తమ ఆలోచనలు, తమ మనసులోని మాటను ఎవరికీ చెప్పాలని అనుకోరు. సీక్రెట్ గా ఉంచుకుంటారు.

99

6.మీన రాశి...
మీన రాశి పిల్లలు కూడా చాలా ఇంట్రావర్టర్స్. కొత్తవారితో కలవలేరు. తమ మనసులో విషయాలను పంచుకోలేరు. అందుకే.. వీరు తొందరగా సీక్రెట్స్ ఏవీ ఎదుటివారితో పంచుకోరు. ఏదైనా విషయం ఎవరితోనైనా పంచుకోవాలని అనుకున్నా వీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు.

click me!

Recommended Stories