చిన్న పిల్లలు, మరణించిన వ్యక్తులు దుస్తులను ఇలా వాడుతున్నారా..?

First Published | Jun 22, 2024, 2:16 PM IST

ఏ క్లాత్ పడితే ఆ క్లాత్ వాడకపోవడమే మంచిది కాదట. ఎందుకంటే... వాడకూడని క్లాత్ లు వాడితే.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే ప్రమాదం ఉందట. 

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడే.. అంటువ్యాధులు లాంటివి రాకుండా ఉంటాయి.  అంతేకాదు.. ఇల్లు నీట్ గా ఉంటే.. ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడాపెరుగుతుంది. ఎక్కువ మందిని ఇంటిని శుభ్రంగా ఉంచే క్రమంలో..వస్తువులను క్లాత్ తో తుడుస్తూ ఉంటారు. అప్పుడు.. పడిన దుమ్ము సులభంగా వదులుతుంది. ఇది మంచి పద్దతే. కానీ... మనం ఎలాంటి క్లాత్ వాడుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.
 

7 quick house cleaning tips

వాస్తు ప్రకారం... ఏ క్లాత్ పడితే ఆ క్లాత్ వాడకపోవడమే మంచిది కాదట. ఎందుకంటే... వాడకూడని క్లాత్ లు వాడితే.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే ప్రమాదం ఉందట. 
 


చిన్న పిల్లల దుస్తులు వాడకూడదు...
మీ ఇంట్లో చాలా చిన్న పిల్లవాడు ఉన్నట్లయితే, మీరు  పిల్లల పాత దుస్తులను దుమ్ము దులపడానికి లేదా శుభ్రం చేయడానికి ఉపయోగించకూడదు. ఎందుకంటే... మీరు ఇలా చేస్తే, అది పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.


లోదుస్తులతో శుభ్రం చేయవద్దు
ఇంటిని ఎప్పుడూ ఎలాంటి లోదుస్తులతో శుభ్రం చేయకూడదు. అవి ఇంటికి శుభాన్ని తీసుకురావు. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది.  అసలు లోదుస్తుల పరిమాణం  చిన్నగా ఉంటుంది కాబట్టి.. అవి దుమ్ము దులపడానికి కూడా సరిపోవు. 
 


మరణించిన వ్యక్తి దుస్తులు..
ఇంట్లో ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు.. వారి దస్తులు అనవసరంగా ఉాన్నాయి కదా.. ఎలాగూ పనికిరావు కదా అని.. ఇంట్లో దుమ్ము దులపడానికి ఉపయోగిస్తూ ఉంటారు.  కానీ అలా చేయకూడదని జోతిష్యశాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రంలో, మరణించిన వారి దుస్తులతో ఇంటిని శుభ్రం చేయడం మంచిది కాదు.
 


ఇక చివరగా.... మీరు ఇంటిని ఎలాంటి సింథటిక్ క్లాత్‌తో శుభ్రం చేయకూడదు. వీటితో శుభ్రం చేస్తే వాటిలో ఎలక్ట్రోస్టాటిక్ చార్జ్ ఏర్పడి ఇంట్లోని వస్తువులకు మంచిది కాదు. ప్రత్యేకించి, అటువంటి వస్త్రాన్ని ఉత్తరం, తూర్పు దిశలో శుభ్రపరచడానికి ఉపయోగిస్తే, అది ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. మీ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఆగిపోతుంది. అలా కాకుండా.. మార్కెట్లో ప్రత్యేకంగా ఇంటిని శుభ్రం చేయడానికి క్లాతులు అమ్ముతుంటారు. వాటిని ఉపయోగించడం ఉత్తమమైన మార్గం. 

Latest Videos

click me!