
మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)
దిన ఫలం:-వ్యాపార భాగస్వాముల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడగలవు.ప్రత్యర్థులతో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.రావలసిన బాకీలు లౌక్యం గా వసూలు కోవాలి. మిత్రులతో మనస్పర్థలు రాగలవు.మనస్సునందు భయంగా ఉంటుంది.ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)
దిన ఫలం:-చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. గొడవలు, కొట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలకు నష్టాలు ఎదురువుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి.
మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి (దినపతి కేతువు )
దిన ఫలం:-చిన్ననాటి మిత్రులను కలుసుకోవడంతో ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. స్థిరాస్తి విషయాల్లో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
దిన ఫలం:-ఉద్యోగుల పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది. రుణం నుంచి బయటపడటానికి బంధు, మిత్రులు సహాయం చేస్తారు. అన్నదమ్ములతో వివాదాలు తొలగిపోయి ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రవి)
దిన ఫలం:-వృత్తి, వ్యాపారాలు డీలా పడతాయి. మొదలుపెట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. కుటుంబ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది. పిల్లలు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వారిని కనిపెట్టుకుంటూ ఉండాలి.
కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి (దినపతి కుజుడు)
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)
దిన ఫలం:- కొత్త అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో మాటలు పడాల్సి వస్తుంది. అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండాలి. కుటుంబ సభ్యులు వింతగా ప్రవర్తిస్తారు. వృత్తి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడతాయి. దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.
తుల (చిత్త 3 4 స్వాతి విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )
దిన ఫలం:-కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే మాటలు పడాల్సి వస్తుంది. ఇంట్లో చిరాకు కలిగించే వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలను అర్జించడానికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులు పై అధికాలచే మాట పడాల్సి వస్తుంది.
వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
దిన ఫలం:-నూతన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో అందరూ కలిసి ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారులకు మంచి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు సమర్థవంతంగా తమ పనిని పూర్తి చేస్తారు.
ధనుస్సు (మూల, పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)
దిన ఫలం:-ఆస్థి విషయంలో అన్నదమ్ములతో వివాదాలొస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. సమాజ సేవలో పాల్గొంటారు. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి (దినపతి గురుడు)
దిన ఫలం:-ముఖ్యమైన పనులను సమర్థవంతంగా పూర్తిచేస్తారు. నూతన వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల్లో నడుస్తాయి. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు పుంజుకుంటాయి. అధికారుల వల్ల ఉద్యోగులు జీతానికి సంబంధించిన శుభవార్త వింటారు.
కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )
దిన ఫలం:- ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న రోజు నిరుద్యోగులకు రాబోతోంది. చిన్ననాటి మిత్రుల ఆహ్వానం అందుతుంది. భూమికి సంబంధించిన క్రయ, విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారులు కష్టపడి పనిచేస్తే మంచి లాభాలను అర్జిస్తారు. మొదలుపెట్టిన పనులు మీరు ఊహించని విధంగా పూర్తి అవుతాయి.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
దిన ఫలం:-ముఖ్యమైన పనులను ఇప్పుడు మొదలుపెట్టకపోవడమే మంచిది. బంధుమిత్రులతో గొడవలు జరుగుతాయి. పెట్టుబడి పెట్టే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. తోటి ఉద్యోగులతో మాట పట్టింపులు వస్తాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి.