మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
గురు:- ఏప్రిల్ నెలాఖరు వరకు జన్మరాశిలో సంచరించి మే నెల నుండి ధనస్థానములో సంచారం
శని:- ఈ సంవత్సరమంతా లాభ స్థానమైన కుంభరాశిలో సంచారము.
రాహు:-ఈ సంవత్సరమంతా వ్యయస్థానంలో సంచారము.
కేతు:-ఈ సంవత్సరమంతా షష్టమ స్థానంలో సంచారము
ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభయోగముంటుంది. శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది. 13.4.2024 నుండి వత్సరాంతం వరకు మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. వృత్తిరీత్యా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తినిస్తాయి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే పట్టుదలతో కొన్ని కార్యా లు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందు తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనా రోగ్య బాధ లుంటాయి. అలాగే కుటుంబ విష యాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. జాగ్రత్తగా నుండుట మంచిది.