ఇంట్లో పిల్లులు ఉంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 27, 2024, 11:11 AM IST

చాలా మంది కుక్కలను, పిల్లలను ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటుంటారు. కానీ జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఇంట్లో కొన్ని జంతువులు ఉండటం అశుభంగా భావిస్తారు. అలాంటిది ఇంట్లో పిల్లలు ఉండటం శుభమా? అశుభమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చాలా మంది తమ ఇండ్లల్లో కుక్కలను, పిల్లులను పెంచుకోవడానికి బాగా ఇష్టపడతారు.కొంతమంది పిల్లులను ఇష్టంగా పెంచుకుంటారు. కానీ పిల్లలను చాలా మంది అశుభంగా భావిస్తారు. అందులోనూ జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఇంట్లో కొన్ని జంతువులు ఉండటం అశుభం.కానీ కొన్ని చోట్ల దీన్ని శుభప్రదంగా భావిస్తారు.

పిల్లి

జనాలు ఇష్టంగా పెంచుకునే జంతువుల్లో కుక్క ఒకటి. ఇద మనిషికి ఎంతో నమ్మకమైన జంతువు. మనిషికి మొదటి స్నేహితుడు కూడా కుక్కనే చెప్తారు. పురాతన కాలం నుంచి కుక్కలు మానవులతో సంబంధం కలిగి ఉన్నాయి. కుక్కలను పెంచడం గురించి మత గ్రంథాలలో కూడా ఉంది. కానీ ఇంట్లో పిల్లిని పెంచడం అశుభమన్న మాటను మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఎందుకు ఇలా అంటారో తెలుసా? 


పిల్లి

ఇంట్లో పిల్లిని పెంచుకోవడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది పిల్లిని ఇంట్లో పెంచుకోవడం శుభప్రదమంటే..మరికొందరు మాత్రం ఇంట్లో పిల్లులను పెంచుకోవడం అశుభంగా భావిస్తారు. ఎందుకంటే ఇంట్లో పిల్లి ఉంటే ప్రతికూలత, దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. జ్యోతిష్యం ప్రకారం.. ఇంట్లో పిల్లులు ఎక్కడ ఉన్నా.. ప్రతికూల శక్తులు పనిచేస్తాయి.

పిల్లి

కానీ ఇంట్లో బంగారు కలర్ ఉండే పిల్లి ఉండటం శుభప్రదమని చెప్తారు. గోధుమ లేదా బంగారు రంగు పిల్లులు ఇంట్లో సంపదను పెంచుతాయంటారు జ్యోతిష్యులు. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న  మీ పనులు కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. అలాగే మీరు సంపాదించిన డబ్బు మరింత పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

పిల్లి

ఒక పిల్లి మీ ఇంట్లో పిల్లులకు జన్మనిస్తే అది ఇంటి యజమానికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. పిల్లులు పుట్టిన 90 రోజుల్లోపు కుటుంబ సభ్యులు ప్రతి రంగంలోనూ అభివృద్ధి, విజయాన్ని సాధిస్తారని జ్యోతిష్యం చెబుతోంది.

పిల్లి

ఎక్కడి నుండో వచ్చిన నల్ల పిల్లి మీ ఇంటికి వచ్చి ఏడవడం ప్రారంభిస్తే అది అశుభంగా పరిగనించబడుతుంది. పిల్లుల అరుపులు, ఏడుపు చెడు ఘటనలను సూచిస్తాయి. రాత్రిపూట పిల్లి అరుపు వినడం చెడు వార్తకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఇంట్లో పిల్లులు పుట్టడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించవని  జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 

Latest Videos

click me!