Kumbha Rashi 2024: న్యూ ఇయర్ లో కుంభ రాశివారు ఆర్థికంగా బలపడతారు..!

First Published | Dec 26, 2023, 1:42 PM IST

మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2024లో కుంభ రాశివారికి ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం..  కుంభ రాశివారికి ఈ సంవత్సరం ఆర్థికంగా కీలకంగా ఉండనుంది.

Aquarius


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

కుంభం   రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం (2024 జనవరి నుంచి 2024 డిసెంబర్) ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఏయే నెలలు కలిసి వస్తుంది...ఎప్పుడు  ఇబ్బందులు ఉంటాయి ... రాశి వార్షిక ఫలాలు లో తెలుసుకుందాం
 

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

గురు:- ఏప్రిల్ నెలాఖరు వరకు తృతీయ స్థానంలో సంచరించి మే నెల నుండి చతుర్ధ స్థానంలో సంచారము.

శని:- ఈ సంవత్సరమంతా  జన్మరాశిలో సంచారము

రాహు:-ఈ సంవత్సరమంతా ధన స్థానంలో సంచారము

కేతు:-ఈ సంవత్సరమంతా  అష్టమ స్థానంలో సంచారము


Image: Freepik


ఈ సంవత్సరం ఈ రాశివారికి  విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబసభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది.  అలాగే ఎక్కడా తగ్గద్దు. ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి.  ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.
 

Daily Aquarius Horoscope

అలాగే  మంచి పనులకై ధనాన్ని వెచ్చిస్తారు. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. వీరికి గ్రహాలన్నీ సంవత్సరమంతా అనుకూలమే. వీరు ఏ కార్యక్రమం చేపట్టినా వెనుదిరగకుండా విజయాలు సాధిస్తారు. ఆదాయం గతంకంటే మరింతగా మెరుగుపడుతుంది. రావలసిన బాకీలు చాలా వరకూ వసూలవుతాయి. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మీపట్ల అసహనంగా ఉన్న వారు కూడా స్నేహహస్తం అందిస్తారు. ఆస్తి వ్యవహారాలలో పెండింగ్లో ఉన్న ఒప్పందాలు ఖరారు చేసుకుంటారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహయత్నాలు ఫలించి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. తండ్రి తరఫు నుండి ధన, ఆస్తి లాభ సూచనలు ఉండవచ్చు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు దక్కే అవకాశం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. అదృష్టయోగం  బాగుంది.  విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో కోరుకున్న స్థాయికి చేరుకుంటారు. వ్యాపారరీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొహమాటం వల్ల రుణసమస్యలు రాకుండా చూసుకోవాలి. విదేశ ప్రయాణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది.
 

Aquarius

వ్యాపారాలలో పెట్టుబడులకు ఢోకాలేదు. లాభాలు విశేషంగా అందుతాయి. ఉద్యోగాలలో మీపై అభియోగాలు తొలగుతాయి. ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారు. పారిశ్రామిక, సాంకేతికవర్గాల వారు విజయాలు సాధిస్తారు. పడిన శ్రమ వృథా కాదు. వైద్యులు, న్యాయవాదులు, పరిశోధకులకు శుభదాయకమే. కళాకారుల  ప్రయత్నాలు కొన్ని ఫలిస్తాయి. వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభదాయకమే. రాజకీయవర్గాలకు ద్వితీయార్ధంలో కొన్ని పదవులు వరించవచ్చు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.   
నిరుద్యోగ యువతకు శుభపరిణామాలు. ఉద్యోగలాభం. ఆదాయపరంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నా ఏదో విధంగా అవసరాలు తీరతాయి. బంధువులు, స్నేహితుల మనోభావాలను గుర్తించి మసలుకోవడం అవసరం. ఒక పరిచయస్తుని ద్వారా అందిన సమాచారం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. బియ్యం మిల్లులు, ఫైనాన్స్రంగంలోని వారికి అనుకూల పరిస్థితులు.

 సంవత్సరం చివర్లో నవంబర్ నుంచి ఉదరం, నరాల బలహీనత వంటి రుగ్మతలు బాధపెట్టవచ్చు. వ్యాపారస్తులు లాభాలు అందుకున్నా ఏదో ఒక వివాదం వెంటాడుతునే ఉంటుంది. భాగస్వాములతోనే విభేదాలు రావచ్చు. ఉద్యోగస్తులు విధుల పట్ల అప్రమత్తంగా మెలుగుతూ చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. వీరిపై నిఘా పెరిగే సూచనలు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవర్గాలు సమస్యలతోనే గడుపుతారు. కళాకారులు అవకాశాలు చేజేతులా పోగొట్టుకుంటారు.  జాగ్రత్తగా ఉండాలి.
 

Latest Videos

click me!