Today Horoscope: ఓ రాశివారు చేసే ఖర్చు యందు అప్రమత్తత అవసరం.

Published : Dec 26, 2023, 03:22 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  చేయరాని పొరపాటు కి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించవలెను. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించవలెను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనవలెను

PREV
113
Today Horoscope: ఓ రాశివారు  చేసే ఖర్చు యందు అప్రమత్తత అవసరం.

26-12-2023, మంగళవారం   మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు  మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
 

213
telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాబలం
అశ్విని నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
భరణి నక్షత్రం వారికి (క్షేమతార)
కృత్తిక నక్షత్రం వారికి  (విపత్తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో  శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి. మానసికంగా బలహీనత ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు యందు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. చేయరాని పొరపాటు కి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించవలెను. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించవలెను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనవలెను.అధికారులు కలహాలు ఏర్పడవచ్చు.  ఓం మృత్యుంజయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

313
telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (విపత్తార)
రోహిణి నక్షత్రం వారికి (సంపత్తార)
మృగశిర నక్షత్రం వారికి (జన్మ తార)

దిన ఫలం:-పట్టుదలతో చేసిన పనులు పూర్తి అగును. ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. వ్యవహారాలలో ప్రతి బంధకాలు  ఏర్పడతాయి. ఇతరులతో కలహాలకు దూరంగా ఉండటం మంచిది. అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అనుకోని సమస్యలు బాధ కలిగించును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్థలు రావచ్చు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శారీరక శ్రమ పెరిగి శరీరం బలహీనత ఏర్పడుతుంది. ఓం మహి సుతాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

413
telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (జన్మ తార)
ఆరుద్ర నక్షత్రం వారికి (పరమైత్రతార)
పునర్వసు నక్షత్రం వారికి (మిత్ర తార)

దిన ఫలం:-విద్యార్థులకు అనుకూలం. వృత్తి వ్యాపారాల యందు ఊహించని ధన లాభం కలుగుతుంది . బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు .ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు . ఇంట బయట మీ ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది . తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి . ఉద్యోగాలలో అధికారులు  స్నేహ సంబంధాలు వలన అధికారి లాభాలు కలిసి వస్తాయి. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు ఓం వాచస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

513
telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (మిత్ర తార)
పుష్యమి నక్షత్రం వారికి  (నైధన తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (సాధన తార)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు . వృత్తి వ్యాపారాలు యందు ఊహించిన ధన లాభం కలుగును. ప్రయత్న పనుల్లో విజయం సాధిస్తారు . అభివృద్ధి విషయంలో ఇతరుల ఆలోచనలు తీసుకోవాలి. కీలకమైన సమస్య లను సమయస్ఫూర్తితో వ్యవహారం చేయాలి . అధికారులు తో పరిచయాలు కలిసి వస్తాయి . ఉద్యోగాలలో అనుకూలమైన వాతావరణం. ఆర్థికంగా బాగుంటుంది . మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును .ఓం శుభప్రదాయ నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి
 

613
telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమ తార)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (విపత్తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం కలుగును. సమాజము నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. చేసే ఖర్చు యందు అప్రమత్తత అవసరం. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి కాగలవు .సంతాన అభివృద్ధి ఆనందం కలిగించును. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదర అభిమానం పొందగలరు. ఓం సదాశివాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి


 

713
telugu astrology

క‌‍న్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (విపత్తార):-

హస్త నక్షత్రం వారికి  (సంపత్తార):-

చిత్త నక్షత్రం వారికి  (జన్మ తార):-

దిన ఫలం:-కీలకమైన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ఎన్ని అవాంతరాలు ఏర్పడిన పట్టుదలతో పనులు పూర్తి చేయవలెను. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల  తీరు ఉపశమనం లభిస్తుంది. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో  అధికారుల ఒత్తిడి తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. ఓం నీలకంఠాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

813
telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి  (జన్మ తార)
స్వాతి నక్షత్రం వారికి (పరమైత్ర తార)
విశాఖ నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-నూతన వస్తు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి.శుభకార్యాలలో పాల్గొంటారు.విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు . స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగుతుంది . సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది .తల పట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఓం షణ్ముఖాయ నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి
 

913
telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (మిత్ర తార)
అనూరాధ నక్షత్రం వారికి  (నైధనతార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-అనవసరమైన జగడాలకు దూరంగా ఉండాలి . ఊహించని ఒడిదుడుకులు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం .తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కఠినంగా మాట్లాడటం వలన కొత్త సమస్యలు ఏర్పడతాయి .మనసునందు అనేకమైన ఆలోచనలతో  ఆందోళన గా ఉంటుంది . బంధుమిత్రులతో మనస్పర్థలు ఏర్పడగలవు. ఇతరులతో వాదన వేయడం మంచిది కాదు. రావలసిన బాకీలు తిరిగి లభించగలవు. శ్రీ రాహు మూర్తయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

1013
telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
పూ.షా నక్షత్రం వారికి (క్షేమ తార)
ఉ.షా నక్షత్రం వారికి  (విపత్తార)

దిన ఫలం:-శారీరకంగా బలహీనంగా ఉంటుంది .  పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అకారణంగా కలహాలు రావచ్చు . కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలత వాతావరణం . ఉద్యోగాలలో పై అధికారులు యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది . వృత్తి వ్యాపారాల యందు మీ అంచనాలు తారుమారవుతాయి.మీతో పాటు ఉండే వారితో విరోధాలు వాదన లకు దూరంగా ఉండాలి . అనవసరమైన ఖర్చులు పెరగకుండా  జాగ్రత్త వహించాలి . ఓం అరుణాయ నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి
 

1113
telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రం వారికి (విపత్తార)
శ్రవణం నక్షత్రం వారికి  (సంపత్తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (జన్మ తార)

దిన ఫలం:-అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి . తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో సామాన్యమైన లాభం కలుగును . అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి . ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు . అనవసరమైన ప్రయాణాలు చికాకుగా ఉంటుంది.  మానసికంగా ఆందోళన గా ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడగలవు. ఆవేశంతో వాదనలు వలన సంఘంలో గౌరవ ప్రతిష్టలు తగ్గును . ఓం హిమ గర్భాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

1213
telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి  (జన్మ తార)
శతభిషం నక్షత్రం వారికి (పరమైత్ర ఎతార)
పూ.భా నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-ఇతరుల యొక్క విషయాలకు దూరంగా ఉండటం మంచిది . వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చేసే పనిలో ఆసక్తి లేకుండా ఉండడం . చేయ పనివారితో ఇబ్బందులు ఏర్పడతాయి . నిరాశ నిస్పృహలకు లోనవుతారు . సమాజంలో అవమానాలు కలిగి గౌరవం తగ్గుతుంది . మనస్సు ఆందోళనగా ఉంటుంది . ఆరోగ్యం సమస్యలు ఇబ్బంది పెడతాయి.స్నేహితులతో మాట పట్టింపులు వస్తాయి . ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృత్తి వ్యాపారాలలో  కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది .ఈ రాశి వారు ఈరోజు ఓం రుద్రాయ నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి
 

1313
telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (మిత్ర తార)
ఉ.భా  నక్షత్రం వారికి  (నైధన తార)
రేవతి నక్షత్రం  వారికి  (సాధన తార)

దిన ఫలం:-మంచివిషయాలు తెలుస్తాయి.  ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు . జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు . మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది . నూతన పరిచయాలు కలిసి వస్తాయి . సోదరి సహోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా బలంగా ఉంటుంది .  వృత్తి వ్యాపారాల్లో అనుకూల మైన ధన లాభం కలుగుతుంది.కీలకమైన సమస్యల నుండి విముక్తి పొందవచ్చును .అభివృద్ధి పనులు ఆలోచనలు ఆచరణలో పెడతారు . పాత మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు .ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః అని జపించండి 

click me!

Recommended Stories