Akshaya Tritiya: అక్షయ తృతీయ అంటే శుభారంభాలకు అత్యంత మంచి రోజు. ఏప్రిల్ 19న జరగనున్న ఈ అక్షయ తృతీయ రోజున అరుదైన గ్రహస్థితులు ఏర్పడుతున్నాయి. దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఈ స్థాయి శుభయోగాలు కలుస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఈ ఏడాది అక్షయ తృతీయ రోజున సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ తమ అత్యున్నత స్థాన రాశుల్లో ఉంటారు. ఇది చాలా అరుదైన పరిస్థితి. దీని వల్ల శుభఫలితాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. సాధారణంగా చేసే పూజలు, కొనుగోళ్లు కూడా ఎక్కువ ఫలితాలను ఇస్తాయని నమ్మకం.
25
ఏర్పడుతున్న ముఖ్యమైన యోగాలు
ఈసారి ఒకేసారి గజకేసరి యోగం, మాలవ్య యోగం, అక్షయ యోగం వంటి మూడు యోగాలు ఏర్పడనున్నాయి. ఈ మూడు యోగాలు కలిసి రావడం చాలా అరుదు. ముఖ్యంగా ధనం, ఉద్యోగం, వ్యాపారం, గౌరవం పెరగడానికి ఇవి సహాయపడతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
35
మేష రాశి వారికి కెరీర్‌లో బంగారు అవకాశం
మేష రాశి వారికి ఈ అక్షయ తృతీయ మంచి అవకాశాలను తెస్తుంది. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. కొత్త ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. చేసిన కష్టం ఫలిస్తుంది. ఉన్నతాధికారులు మీ పనిని గుర్తిస్తారు. వ్యాపారులకు కొత్త కస్టమర్లు రావడం వల్ల లాభాలు పెరుగుతాయి.
ధనుస్సు రాశి వారికి ఇది కోరికలు నెరవేరే సమయం. ఇల్లు కొనాలనే ఆలోచన ఉంటే అది నిజమయ్యే అవకాశం ఉంది. కళలు, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి పేరు, డబ్బు రెండూ వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల కూడా ఉండొచ్చు.
వృషభ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. డబ్బు సమస్యలు తగ్గడం ప్రారంభమవుతుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఉన్నతాధికారుల మద్ధతు లభిస్తుంది. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
55
తులా రాశి వారికి ప్రాపర్టీ, గౌరవం పెరుగుదల
తులా రాశి వారికి ఈ రోజు చాలా శుభ సంకేతాలు ఇస్తుంది. ఇల్లు లేదా ప్రాపర్టీ కొనుగోలు చేసే యోచనలు సఫలం కావచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో వేగంగా ఎదుగుదల కనిపిస్తుంది.
మొత్తం మీద 2026 అక్షయ తృతీయ ప్రత్యేక గ్రహస్థితుల వల్ల చాలా శుభఫలితాలు ఇవ్వబోతోంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఇది జీవితంలో కొత్త మార్పులకు దారితీసే సమయం కావచ్చు. ఈ రోజున శుభకార్యాలు ప్రారంభించడం మంచిదిగా భావిస్తున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.