కుజుడు మేషరాశిలోకి రావడం కుంభ రాశివారికి శుభ ఫలితాలనిస్తుంది. కమ్యూనికేషన్, ప్రయాణాలు, కొత్త పరిచయాల పరంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సోదరులు, స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. ఉద్యోగంలో కొత్త ఐడియాలు మీకు గుర్తింపును తెస్తాయి. వ్యాపారంలో మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగితే ఈ కాలం మీకు అభివృద్ధి, అవకాశాలను అందిస్తుంది.