మనం ఎలా ఉన్నాం అనేది మనకు ఉన్న అలవాట్లే నిర్ణయిస్తాయి. మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నవారు.. ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. అదే.. చెడు అలవాట్లు ఉన్నవారికి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
1. 1, 10, 19, 28..
ఈ పైన తేదీల్లో పుట్టిన వారు జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా, సంతోషంగా ఉండాలి అంటే.. వారు ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది. సూర్యుడికి నమస్కరించడం వల్ల వారికి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి.
2. 2, 11, 20, 29..
ఈ తేదీల్లో పుట్టిన వారు కాస్త శుభ్రతపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ రాశివారు పరిశుభ్రంగా ఉంటూ... రోజూ చక్కగా తమ ఒంటికి, దుస్తులకు పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఉంటే.. వారికి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3. 3, 12, 21, 30...
ఈ తేదీల్లో పుట్టిన వారు కాస్త ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రతిరోజూ వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండాలి. అప్పుడే వారు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు.
4.4, 13, 22, 31..
ఈ తేదీల్లో పుట్టిన వారు తమ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా, సంతోషంగా ఉండాలి అంటే వారు... ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవడం మంచిది. దీనిని వెంటనే చదవడం అలవాటు చేసుకోవాలి.
5. 5, 14, 23..
ఈ తేదీల్లో పుట్టిన వారు.. తమ జీవితంలో ఆనందంగా ఉండాలన్నా.. సమస్యలు రాకూడదన్నా.. ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని జపించడం తప్పనిసరి. ఇది చదవడం అలవాటు చేసుకుంటే వారి జీవితంలో జరిగే మార్పులు కచ్చితంగా చూస్తారు.
6.6, 15, 24...
ఈ తేదీల్లో పుట్టిన వారు కూడా... తమ జీవితంలో మార్పులు రావాలన్నా.. తాము ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి అనుకుంటే... వారు మాంసాహారం తినడం మానేయాలి. అలా మాననేసిన నాడు.. వారికి చాలా మంచి జరుగుతుంది.
7.7, 16, 25..
ఈ తేదీల్లో పుట్టిన వారు తాము జీవితంలో కోరుకున్నవి అన్నీ దక్కాలి అన్నా... సంతోషంగా జీవితం సాగించాలి అన్నా... ఆ శివయ్యను పూజించాలి. ప్రతి సోమవారం శివుడిని పూజించి.. ఉపవాసం ఉంటే సరిపోతుంది.
8.8, 17, 26...
ఈ తేదీల్లో పుట్టిన వారు వీలైనంత వరకు దానధర్మాలు చేయడం మంచిది. అదేవిధంగా.. సోమవారం ఉపవాసం ఉండే అలవాటు చేసుకోవాలి. ఈ అలవాట్లు వాళ్ల జీవితాలనే మార్చేస్తాయి.
9.9, 18, 27...
ఈ తేదీల్లో పుట్టినవారు తమ జీవితంలో సమస్యలు తొలగిపోవాలంటే... ప్రతిరోజూ తులసిమాతను పూజించాలి. శుభ్రంగా స్నానం చేసి రోజూ తులసి మాతకు నీరు సమర్పించాలి. ఈ అలవాటు కూడా వారి జీవితంలో చాలా సానుకూల మార్పులు తీసుకువస్తుంది.