ఈ రాశివారు సున్నితమనస్కులు, సెంటిమెంట్ ఎక్కువ...

Published : May 12, 2022, 01:06 PM IST

ఈ రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. చాలా మృధుస్వభావులు. సెంటిమెంట్ ఎక్కువ. ప్రతీ ఒక్కరిలో ఈ గుణం ఉన్నప్పటికీ 12 రాశుల వారిలో కొన్ని రాశులు మరీ ఎక్కువగా ఉంటాయి. అవేంటో చూడండి.

PREV
15
ఈ రాశివారు సున్నితమనస్కులు, సెంటిమెంట్ ఎక్కువ...

కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు. ప్రతీదానికి సెంటిమెంట్ గా ఫీలవుతారు. చిన్న చిన్న విషయాలకే భావోద్వేగాలను లోనవుతుంటారు. అయితే ఇదంతా రాశిప్రకారమే జరుగుతుందట.. 

25

కర్కాటకరాశి 
కర్కాటకరాశి వారికి తెలిసినదల్లా ప్రేమ మాత్రమే. ప్రేమ విషయానికి వస్తే వారు చాలా సెంటిమెంట్‌గా ఉంటారు. వారు ద్రోహం, బాధ, నొప్పిని తట్టుకోలేరు. వారు తమ కంటే ఇతరులను చూసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. వారి భావోద్వేగాలతో చాలా పారదర్శకంగా ఉంటారు.

35

మీనరాశి
కర్కాటక రాశి వారి తరువాత, వారు భూమిపై అత్యంత సున్నితమైన వ్యక్తులు మీనరాశి వారే. ఈ రాశివారు భావోద్వేగాలకు చాలా ప్రాముఖ్యతనిస్తారు. తమని అగౌరవంగా చూడడాన్ని లేదా బాధపెట్టడాన్ని భరించలేరు. చిన్నపాటి అసౌకర్యానికి కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. మీనరాశివారిని ఏడిపించకుండా ఉండడం చాలా మంచిది. 

45

తులారాశి
వారు తమ ఆత్మబంధువును కనుగొన్న తర్వాత వారితో చాలా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉంటారు. తులారాశివారు ప్రేమించినప్పుడు.. వారు తమ హృదయంతో ప్రేమిస్తారు. ఒకసారి వీరు ప్రేమలో విఫలం అయితే, ముందుకు సాగడం కష్టం. దానినుంచి వారాల తరబడి బాధలోనే ఉంటారు.

55
Leo

సింహరాశి
సాధారణంగా ప్రపంచానికి కనిపించేది ఏంటంటే సింహరాశివారు చాలా దృఢమైన వ్యక్తులు.. కానీ బైటికి కనిపించేది వేరు. సింహరాశివారు అంతర్గతంగా చాలా సున్నితంగా ఉంటారు. వారు అబద్ధం చెప్పినా లేదా ప్రేమించక పోయినా సహించలేరు. వారు కోరుకునేది నిజమైన ప్రేమ. సింహరాశివారు కూడా తమను గారం చేయడం, తమని ఇష్టంగా ప్రేమించబడడాన్ని ఇష్టపడతారు.

Read more Photos on
click me!

Recommended Stories