Solar, Lunar Eclipse: 2026లో సూర్య, చంద్ర గ్రహణాలు.. ఈ రాశులకు అడుగడుగునా అడ్డంకులే..!

Published : Dec 27, 2025, 10:31 AM IST

Solar, Lunar Eclipse:మరి కొద్ది రోజుల్లో 2026 ప్రారంభం కానుంది. ఈ ఏడాదిలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ప్రతి అడుగులోనూ తీవ్రమైన అడ్డంకులు ఎదురౌతాయి. 

PREV
14
సూర్య, చంద్ర గ్రహణాలు..

జోతిష్య శాస్త్రంలో సూర్య, చంద్ర గ్రహణాలకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఈ గ్రహణాల సమయంలో శుభకార్యాలు చేయడం మంచిది కాదు అని మన పూర్వీకులు చెబుతుంటారు. ఈ కాలంలో, జీవితంలో మానసిక, భావోద్వేగ, శారీరక విషయాల్లో చాలా మార్పులు జరుగుతాయి. 2026 సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవిస్తాయి.వీటిలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు.

మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17, 2026న సంభవిస్తుండగా, రెండో సూర్య గ్రహణం ఆగస్టు 12, 2026న సంభవిస్తోంది. అదేవిధంగా మొదటి చంద్ర గ్రహణం మార్చి 3,2026న సంభవిస్తే.. రెండోది ఆగస్టు 28న 2026న సంభవిస్తోంది. కాబట్టి, 2026లో సంభవించే ఈ గ్రహణాలు ఏ రాశులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం....

24
2026 మొదటి సూర్య గ్రహణం...

కొత్త సంవత్సరం మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17, 2026 న ఏర్పడనుంది. ఆ రోజు ఫాల్గుణి అమావాస్య. ఈ మొదటి సూర్య గ్రహణం కుంభ రాశి, శతభిష నక్షత్రంలో సంభవిస్తుంది. ఈ సూర్య గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలో ఉంటాయి. ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా కుంభ రాశి వారిపై మాత్రమే ఉంటుంది.

కుంభ రాశిపై సూర్య గ్రహణ ప్రభావం....

2026లో మొదటి సూర్య గ్రహణం కుంభ రాశివారిపై చాలా ఎక్కువగా చూపించనుంది. ఈ సమయంలో ఈ రాశివారు తమను తాను ఆత్మ పరిశీలన చేసుకుంటారు. జీవితంలో చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్ లో అనేక మార్పులు జరిగే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది. ఇతరులతో విభేదాలు, అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అదేవిధంగా, మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే, ఈ రాశివారు అలాంటి సమయంలో చాలా ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో తొందరపడి ఎలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకుంటే, వాటిని సీక్రెట్ గా ఉంచుకోవాలి.

34
2026 మొదటి చంద్రగ్రహణం

2026 మొదటి చంద్రగ్రహణం మార్చి 3న సంభవిస్తుంది. ఈ చంద్రగ్రహణం అశుభ ప్రభావం ఎక్కువగా కన్య రాశి వారిపై పడనుంది...

కన్య రాశిపై చంద్ర గ్రహణ ప్రభావం...

2026 మొదటి చంద్రగ్రహణం కన్య రాశిలో జన్మించిన వారి జీవితంలో ఆకస్మిక మార్పు , ఆత్మపరిశీలనను సూచిస్తుంది. కాబట్టి, ఈ కాలంలో పనిలో, కార్యాలయంలో చాలా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కన్య రాశిలో జన్మించిన వారు ఈ కాలంలో చాలా భావోద్వేగ హెచ్చుతగ్గులను అనుభవిస్తారు. కుటుంబ విషయాలలో చాలా ఒత్తిడి ఉంటుంది. కన్య రాశిలో జన్మించిన వారు ఈ కాలంలో చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ కాలంలో పాత పనులను పూర్తి చేయడం, మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోవడం ద్వారా మీరు చాలా ప్రయోజనాలను పొందవచ్చు.

44
రెండో సూర్య, చంద్ర గ్రహణాలు..

ఈ సంవత్సరం రెండవ సూర్యగ్రహణం ఆగస్టు 12, 2026న సంభవిస్తుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ సూర్యగ్రహణం ఆఫ్రికా, యూరప్, అంటార్కిటికా, స్పెయిన్, ఉత్తర అమెరికా, గ్రీన్‌ల్యాండ్ , ఐస్‌లాండ్‌లలో కనిపిస్తుంది.

మీన రాశిపై రెండో చంద్ర గ్రహణ ప్రభావం..

2026 రెండవ చంద్రగ్రహణం ఆగస్టు 28న సంభవిస్తుంది. దీని ప్రభావం ఎక్కువగా మీన రాశి వారిపై కనిపించవచ్చు. ఈ గ్రహణం మీన రాశి వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందువల్ల, ఈ కాలంలో, మీన రాశి వారు చాలా మానసిక సమస్యలను నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీన రాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల, సంబంధాలలో భావోద్వేగ అస్థిరత ఏర్పడవచ్చు. ఈ కాలంలో ఆధ్యాత్మికతపై మీ ఆసక్తి పెరగవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories