జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి పేరుకు ప్రత్యేకమైన శక్తి, ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఓ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి కొత్త ఆశలు, అవకాశాలు, అదృష్టం కలిసివస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ అక్షరం ఏంటో తెలుసుకుందామా…
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం కొన్ని అక్షరాలకు ప్రత్యేకమైన గ్రహబలం ఉంటుంది. 2026 సంవత్సరం కూడా అలాంటి ప్రత్యేకతను కలిగి ఉంది. ముఖ్యంగా “స” (S) అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ సంవత్సరం అనేక విషయాల్లో అనుకూల ఫలితాలు ఉన్నట్లు జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. గురు, శని గ్రహాల స్థితి, రాశి మార్పులు, నక్షత్ర ప్రభావాలు కలిసి “స” అక్షరానికి బలమైన పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయని చెబుతున్నారు.
26
అన్ని రంగాల్లో మంచి అవకాశాలు
ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం.. జన్మ రాశి, నక్షత్రాలతో లోతైన సంబంధం కలిగి ఉంటుంది. “స” అక్షరం శని, గురు ప్రభావాలకు అనుకూలంగా స్పందించే అక్షరం. 2026లో గురు గ్రహం అనుకూల స్థానాల్లో సంచరించడం వల్ల ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాల్లో మంచి అవకాశాలు అందుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా కష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఈ సంవత్సరం ఊరటను, స్థిరత్వాన్ని తీసుకువస్తుందని సూచిస్తున్నారు.
36
గురు, శని ప్రభావంతో..
ఉద్యోగాల్లో ప్రమోషన్, జీతం పెరుగుదల లేదా మంచి బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నాయి. శని గ్రహ ప్రభావం క్రమశిక్షణ, ఓర్పు నేర్పిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం అదృష్టాన్ని పెంచుతుంది. దీని వల్ల “స” అక్షరంతో పేరు మొదలయ్యే వారు తమ శ్రమకు తగిన గుర్తింపు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంవత్సరం రెండో భాగంలో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి.
వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలు, విస్తరణ ఆలోచనలు సఫలమవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం “స” అక్షరం మాటకు, కమ్యూనికేషన్‌కు సంబంధించిన శక్తిని కలిగి ఉంటుంది. అందువల్ల చర్చలు, ఒప్పందాల వంటి విషయాల్లో ఈ అక్షరంతో పేరు ఉన్నవారు ముందుంటారు. సరైన టైంకి సరైన నిర్ణయం తీసుకొని లాభాలు పొందుతారు.
56
వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందంటే?
“స” అక్షరంతో పేరు మొదలయ్యే వారు కొత్త సంవత్సరంలో భావోద్వేగాల పరంగా సమతుల్యంగా ఉంటారు. దాంపత్య జీవితంలో ఉన్న అపోహలు, దూరాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. పెళ్లి కానివారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
66
విద్యార్థులకు అనుకూలం
“స” అక్షరంతో పేరు మొదలయ్యే విద్యార్థులకు 2026 సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు లభిస్తాయి. గురు గ్రహ ప్రభావం వీరికి జ్ఞానం, ఏకాగ్రతను పెంచుతుంది.
జాగ్రత్తలు
శని ప్రభావం వల్ల అలసట, ఒత్తిడి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. జీవన శైలిపై శ్రద్ధ పెట్టడం, మనసుకు ప్రశాంతతనిచ్చే పనులు చేయడంతో పాటు యోగ, ధ్యానం వంటివి కూడా “స” అక్షరంతో పేరు ఉన్నవారికి మానసిక బలాన్ని ఇస్తాయని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.