2025లో మిథున రాశిలో గురువు సంచారం
2025లో గురు, శని, రాహు, కేతువుల సంచారం జరుగుతుంది. ఇందులో గురువు బలవంతుడిగా శుభ ఫలితాలను ఇవ్వనున్నాడు. 2025 నూతన సంవత్సరంలో జనవరి 16 నుంచి గురువు వక్రీకరించనున్నాడు. తర్వాత మే 14న వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచరిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి మేలు జరగనుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి 2025లో శుభ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆస్తి సంబంధి, ఆర్థిక సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నం విజయవంతమవుతుంది. వ్యాపారంలో రెట్టింపు లాభాలు పొందుతారు. ప్రముఖ వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. శుభ కార్యాలు విజయవంతమవుతాయి.
కన్య రాశి:
గురు కృపతో కన్య రాశి వారికి రెట్టింపు లాభం రానుంది. ధన, భాగ్య యోగం లభించనుంది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. జీవితంలో ప్రగతి, ఆర్థికంగా అభివృద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్త వింటారు.
మేష రాశి:
గురువు కారణంగా మేష రాశి వారికి ఎంతో మేలు జరగనుంది. ఊహించన దానికంటే ఎక్కువ జీతం పొందే అవకాశం ఉంది. ఆగిపయిన పనులు పూర్తి అవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సొంత ఇల్లు కట్టుకునే యోగం ఉంది. ఇంట్లో శుభకార్యాలు, వివాహ యోగం ఉంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశికి 11వ అధిపతి గురువు. గురువు వక్రించడం కారణంగా అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కీర్తి, ప్రశంసలు, ఆస్తి, సుఖం, పదోన్నతి, జీతం పెరుగుదల వంటి సానుకూల ఫలితాలు ఉన్నాయి.
మకర రాశి:
ఇంట్లో శుభకార్యాలు. సొంత ఇల్లు కట్టుకునే యోగం ఉంది. భూమి కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు, వ్యాపారంలో రెట్టింపు లాభం వస్తుంది. ప్రభుత్వ సహాయం లభిస్తుంది.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి కూడా ఈ ఏడాది మంచి సూచనలు ఉన్నాయి. వివాహ యోగం ఉంది. ధనవంతుల కుటుంబంలో సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమలో విజయం, కొత్త ఉద్యోగాలు, పదోన్నతి, జీతం పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.