చంద్రబాబు కొంప ముంచిన పవన్ కల్యాణ్

First Published May 24, 2019, 7:49 AM IST

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి వీచిన గాలిలో టీడీపీ పరాజయం పాలైంది. అయితే, తెలుగుదేశం పార్టీకి సీట్లు గణనీయంగా తగ్గడానికి జనసేన కారణమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే ప్రజలు మరోటి తలిచారు. పవన్ కల్యాణ్ జనసేన పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తనకు లాభం కలుగుతుందని తమ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని ఆయన భావించారు. కానీ జనసేన తెలుగుదేశం పార్టీనే ఘోరంగా దెబ్బ తీసింది
undefined
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి వీచిన గాలిలో టీడీపీ పరాజయం పాలైంది. అయితే, తెలుగుదేశం పార్టీకి సీట్లు గణనీయంగా తగ్గడానికి జనసేన కారణమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ విజయం సాధించిన 32 చోట్ల అది సాధించిన మెజారిటీ కన్నా జనసేన గణనీయమైన ఓట్లు సాధించింది
undefined
2009లో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసింది. అదే రీతిలో జనసేన ఈసారి దెబ్బ తీసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 80 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. అక్కడ కాంగ్రెస్‌ సాధించిన మెజారిటీ కన్నా పీఆర్పీకి అధిక ఓట్లు వచ్చాయి
undefined
ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో టీడీపీ కేవలం 5 వేల ఓట్ల లోపు ఓడిపోయిన స్థానాలు 28 దాకా ఉన్నాయి. ఈసారి యలమంచిలిలో టీడీపీ అభ్యర్థిపై వైసీపీకి 4 వేల ఓట్లు ఆధిక్యం వచ్చింది. జనసేనకు 16,500 ఓట్లు వచ్చాయి. రామచంద్రపురంలో వైసీపీకి 5వేల ఓట్లు మెజారిటీ రాగా, జనసేనకు 17,592 ఓట్లు వచ్చాయి
undefined
తణుకులో వైసీపీ 1264 ఓట్లతో విజయం సాధించింది. జనసేనకు అక్కడ 35502 ఓట్లు పోలయ్యాయి. విజయవాడ వెస్ట్‌లో వైసీపీ 6వేల ఓట్ల తేడాతో గెలిస్తే జనసేనకు 22,312 ఓట్లు వచ్చాయి. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ 1587 ఓట్లతో ఓడిపోగా జనసేనకు 4104 ఓట్లు పడ్డాయి. తిరుపతిలో వైసీపీ 708 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచింది. ఇక్కడ జనసేన అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తికి 12వేలకు పైగా ఓట్లు వచ్చాయి
undefined
click me!