కొణతాల నో: అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్ధి ఆయనే

First Published Mar 11, 2019, 11:18 AM IST

విశాఖ జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి ఆడారి ఆనంద్‌ పేరును టీడీపీ ఖరారు చేసింది. అయితే టీడీపీలోకి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఈ నెల 17వ తేదీన చేరనున్నారు.

విశాఖ జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి ఆడారి ఆనంద్‌ పేరును టీడీపీ ఖరారు చేసింది. అయితే టీడీపీలోకి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఈ నెల 17వ తేదీన చేరనున్నారు. అయితే కొణతాల ఏ స్థానం నుండి పోటీ చేస్తారనే విషయామై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కారణంగానే పార్టీలోని నేతల మెజారిటీ నిర్ణయం మేరకు ఆడారి ఆనంద్‌కు అనకాపల్లి ఎంపీ టిక్కెట్టును చంద్రబాబునాయుడు ఖరారు చేసినట్టుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
undefined
అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే టీడీపీ అభ్యర్ధిని ఇంకా చంద్రబాబునాయుడు ఫైనల్ చేయలేదు. కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరుతున్నందునే ఈ స్థానానికి అభ్యర్ధిని ఫైనల్ చేయలేదని చెబుతున్నారు.
undefined
ఇటీవలనే చంద్రబాబునాయుడుతో భేటీ అయిన కొణతాల రామకృష్ణ ఏ స్థానం నుండి పోటీ చేస్తాననే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. కొణతాల అనకాపల్లి ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తారనే ప్రచారం కూడ సాగింది. కానీ, కొణతాల నుండి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఈ స్థానానికి ఆడారి ఆనంద్‌ పేరును చంద్రబాబునాయుడు ఖరారు చేశారు.
undefined
కొణతాల రామకృష్ణకు అనకాపల్లి అసెంబ్లీ సీటును కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కు చంద్రబాబునాయుడు టిక్కెట్టును ఖరారు చేయలేదని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే ఇదే స్థానం నుండి పీలా గోవింద్ మరోసారి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
undefined
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పెందుర్తి స్థానానికి మరోసారి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, నర్సీపట్నం నుండి మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎలమంచిలి నియోజకవర్గం నుండి పంచకర్ల రమేష్‌బాబుకు టిక్కెట్లు ఖరారు చేశారు..
undefined
విశాఖ ఉత్తర అసెంబ్లీ స్థానం నుండి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేయాలని చూశారు. కానీ, ఎలమంచిలిలోనే పోటీ చేయాలని బాబు పంచకర్ల రమేష్‌బాబుకు సూచించారు. దీంతో ఆయన ప్రచార ఏర్పాట్లు చేసుకొంటున్నారు.ఇక పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనితపై తీవ్ర వ్యతిరేకతను స్థానిక పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ స్థానంలో మరికొందరి పేర్లను పరిశీలిస్తున్నారు.
undefined
మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు కుమార్తె విజయలక్ష్మిని ఈ స్థానం నుండి పోటికి దింపాలని స్థానిక టీడీపీ నేతలు చంద్రబాబును కోరుతున్నారు.చోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే కేవీఎస్ఎస్ రాజుపై కూడ కొందరు ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ స్థానంలో కాపు సామాజికవర్గానికి చెందిన వారికి టిక్కెట్టు ఇవ్వాలని బాబు యోచిస్తున్నారు.
undefined
మాడ్గుల అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే రామానాయుడుతో పాటు పైలా ప్రసాదరావు, ముత్యాలనాయుడు, పీఎస్ నాయుడు పేర్లను పరిశీలిస్తోంది. మరో వైపు ఈ స్థానం నుండి మాజీ మంత్రి సబ్బం హరి పేరు కూడ టీడీపీ నాయకత్వం పరిశీలనలో ఉంది. దీంతో సోమవారం నాడు అనకాపల్లి నియోజకవర్గంలోని పెండింగ్ స్థానాలను ఫైనల్ చేసేందుకు ఆ జిల్లా నేతలతో బాబు సమావేశం కానున్నారు.
undefined
click me!