బాబాయ్‌కు జగన్ నో టికెట్: వైసిపి లోకసభ అభ్యర్థులు వీరే...

First Published Mar 10, 2019, 11:54 AM IST

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోకసభ అభ్యర్థుల విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోకసభ అభ్యర్థుల విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒంగోలులో తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ టికెట్ ఇవ్వకపోవచ్చునని అంటున్నారు. ఆ లోక్‌సభ స్థానంలో పార్టీ టికెట్‌ను ఆయనకు నిరాకరించినట్లు తెలుస్తోంది
undefined
ఒంగోలు నుంచి నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని బరిలోకి దించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. పార్టీలో అధికారికంగా చేరని మాగుంట శ్రీనివాసులురెడ్డిని నెల్లూరు నుంచి పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
undefined
శనివారంనాడు పార్టీలో చేరిన మోదుగుల వేణుగోపాలరెడ్డికి గుంటూరు, దాసరి జైరమేశ్‌కు విజయవాడ లోక్‌సభ స్థానాలను జగన్ ఖరారు చేశారు. గుంటూరులో తాను టీడీపి పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్న విషయం తెలిసిందే.
undefined
దువ్వాడ శ్రీనివాస్ (శ్రీకాకుళం), బొత్స ఝాన్సీ (విజయనగరం), ఎంవీవీ చౌదరి (విశాఖ), వరుదు కల్యాణి(అనకాపల్లి), గంజి అశోక్‌(కాకినాడ), మార్గాని భరత్‌ (రాజమహేంద్రవరం), చింతా అనూరాధ (అమలాపురం), రఘురామకృష్ణంరాజు(నరసాపురం), కోటగిరి శ్రీధర్‌(ఏలూరు), బాలశౌరి(మచిలీపట్నం) అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు తెలుస్తోంది.
undefined
లావు శ్రీకృష్ణ దేవరాయలు(నరసరావుపేట), పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి(రాజంపేట), వైఎస్‌ అవినాశ్‌రెడ్డి(కడప), గోరంట్ల మాధవ్‌ (హిందూపురం), పి.డి.రంగయ్య(అనంతపురం), బ్రహ్మానందరెడ్డి(నంద్యాల) అభ్యర్థిత్వాలు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.
undefined
అయితే అధికారికంగా జగన్ వారి పేర్లను ప్రకటించలేదు. అయితే అభ్యర్థులు మాత్రం ప్రస్తుతానికి వీరేనని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల నాటికి వీరికంటే బలమైన వ్యక్తులు పార్టీలోకి వస్తే వీరిని తప్పించి కొత్తవారికి ఇవ్వడానికి కూడా జగన్ వెసులుబాటు ఉంచుకున్నట్లు తెలుస్తోంది
undefined
click me!