చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇదే....

First Published May 23, 2019, 11:23 AM IST

ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే... తెలంగాణ సీఎం కేసీఆర్... టీడీపీ అధినేత చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లేననే వాదనలు వినపడుతున్నాయి.
 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షమయ్యాయి. వైసీపీ అధినేత జగన్.... మేజిక్ ఫిగర్ ని చేరుకున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకునే దిశగా రికార్డు సృష్టిస్తున్నారు.
undefined
అయితే... ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే... తెలంగాణ సీఎం కేసీఆర్... టీడీపీ అధినేత చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లేననే వాదనలు వినపడుతున్నాయి.
undefined
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ని ఓడించేందుకు చంద్రబాబు... కాంగ్రెస్ తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే.
undefined
ఆ సమయంలో... చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని... ఘోరంగా ఓడిపోయేలా చేస్తానని కేసీఆర్ శపథం చేశారు. దీనిలో భాగంగానే.. కేసీఆర్.. వైసీపీ అధినేత జగన్ తో చేతులు కలిపారు.
undefined
చంద్రబాబు నాయుడును ప్రజలు తిరస్కరిస్తున్నారని. తన ముందే ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు సిగ్గు తెచ్చుకున్నాడని కేసీఆర్ గతంలోనే చెప్పారు. కచ్చితంగా చంద్రబాబు ఓడిపోతారని చెప్పారు.
undefined
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ఫలితాలు చూస్తుంటే... రౌండు, రౌండుకి వైసీపీ ఆధిక్యం పెరిగిపోతోంటే... టీడీపీ ఆధిక్యం పడిపోతోంది. జగన్ గెలుపు లాంఛనమేనని అర్థమైపోతోంది.
undefined
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ వల్లనే టీడీపీ ఓటమి పాలైందా అనే అనుమానాలు ప్రస్తుతం అందరిలోనూ కలుగుతున్నాయి.
undefined
ఈ రిటర్న్ గిఫ్ట్ లో భాగంగా కేసీఆర్ చాలానే చేశారు.
undefined
కీలక నేతలంతా జగన్ కి మద్దతు ఇవ్వడం... సినీ ప్రముఖులంతా వైసీపీలో చేరడం లాంటివన్నీ... అందులో ఒక భాగమేననే అప్పట్లో ప్రచారం జరిగింది. హైదరాబాద్ లో ఆస్తులున్న సినీ ప్రముఖులను కేసీఆర్ బెదిరించి మరీ.. వైసీపీలో చేరేలా చేశారనే వాదనలు వినపడ్డాయి.
undefined
చంద్రబాబును ఇంటికి పంపించేందుకు ఏపీ ప్రజలు సిద్దంగా ఉన్నారని, ఎన్నికల తర్వాతే తమ రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుందో...టీడీపీ నేతలకు తెలుస్తుందని కేటీఆర్ ఒకానొక సమయంలో అన్నారు.
undefined
ప్రస్తుత ఫలితాలను చూస్తుంటే.. అదే నిజమని అనిపిస్తోంది. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ మహిమో... జగన్ పాదయాత్ర కృషో తెలీదు కానీ... వైసీపీ మాత్రం ఏపీలో గెలుపు బావుటా ఎగురవేస్తోంది.
undefined
click me!