జగన్ పాదయాత్రకు జనం జేజేలు: బాబుపై మడమ తిప్పని పోరు

First Published May 23, 2019, 11:02 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది. ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సీఎంగా పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది. ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సీఎంగా పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది.
undefined
దీంతో వైయస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైయస్ జగన్ సీఎం కావాలన్న ఆకాంక్షను నెరవేర్చింది ప్రజా సంకల్పయాత్ర. అదే పాదయాత్ర. వైయస్ జగన్ సీఎం కావడానికి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బ్రహ్మాస్త్రమే పాదయాత్ర.
undefined
రాజకీయ పాదయాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన తెలుగునేల వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు మరోసారి నీరాజనం పలికింది. గతంలో ప్రజా సమస్యలు తెలుసుకుందాం అనే నినాదంతో పాదయాత్రలు చేపట్టిన వారికి తెలుగునేల అధికారాన్ని కట్టబెట్టింది.
undefined
అలా వైయస్ జగన్ సైతం పాదయాత్రనే ఆఖరి అస్త్రంగా మలచుకున్నారు. పాదయాత్రద్వారా ప్రజలకు చేరువయ్యి వారి సమస్యలు తెలుసుకుని అధికార పగ్గాలు చేపట్టాలని చేసిన ఆయన ప్రయత్నం నెరవేరింది. ఏపీలో పాదయాత్ర చేసిన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న నానుడిని నిజం చేశారు వైఎస్ జగన్.
undefined
కేవలం పాదయాత్ర వల్లే అధికారంలోకి వచ్చారు అనేదానికన్నా ఆయా పార్టీలు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది పాదయాత్ర అని చెప్పుకోవాలి. అలా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది ప్రజా సంకల్పపాదయాత్ర.
undefined
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో తమకు న్యాయం జరగడం లేదని భావిస్తూ ప్రజా తీర్పుకోసం బయలుదేరారు. ప్రజల సమక్షంలోనే ప్రజల తీర్పును కోరతానంటూ అసెంబ్లీకి గుడ్ బై చెప్పి ప్రజలబాట పట్టారు.
undefined
అలా ఏర్పడిందే ప్రజా సంకల్పయాత్ర. దాదాపు ఏడాదిపాటు 3వేల కిలోమీటర్లుకు పైగా పాదయాత్ర చేస్తూ ప్రజలకు అత్యంత చేరువయ్యారు వైయస్ జగన్. తన పాదయాత్ర ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ విధానాలను తూర్పరబడుతూ ప్రతీ ఇంటి గడపను తట్టారు వైయస్ జగన్.
undefined
2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఏడాదికి పైగా నిర్విరామంగా కొనసాగింది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలను, హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ జగన్‌ పాదయాత్ర చేపట్టారు.
undefined
రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల హామీని పూర్తిగా అమలు చేయకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల్లో దోపిడీ, రాజధాని నిర్మాణంలో అక్రమాలు, ఇసుక దోపిడీ, మైనింగ్‌ అక్రమాలు, యువతకు నిరుద్యోగ భృతి కల్పనలో విఫలం వంటి అంశాలను ప్రధాన అస్త్రంగా చేసుకుంటూ జగన్ పాదయాత్రలో దూసుకుపోయారు.
undefined
పాదయాత్ర చేస్తున్నప్పుడు తనపై హత్యాయత్నం జరిగినా పట్టించుకోకుండా మళ్లీ పాదయాత్రకు సై అంటూ అందరిని కలుసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు వైయస్ జగన్. అలా పాదయాత్రలో ముందుకెళ్లిన జగన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ ముందు వరుసలోనే ఉంటూ అధికారంలోకి రావడం జరిగింది.
undefined
YS JaganmohanReddy Praja Sankalpa Yatra in Tuni
undefined
click me!