విశాఖ జిల్లా నుంచే నారా లోకేష్ పోటీ: బాలయ్య అల్లుడు భరత్ కు ఎసరు

First Published Mar 8, 2019, 2:41 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, ఐటీ పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ విశాఖపట్నం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, ఐటీ పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ విశాఖపట్నం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే ఏ సీటు నుంచి పోటీ చేయాలనేది ఇంకా ఖరారు కాలేదు.
undefined
విశాఖ ఉత్తరం, భీమిలి సీట్లలో ఏదో ఒకదానిలో ఆయన పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. విశాఖ ఉత్తరం సీటు నుంచి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భీమిలి సీటు నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు
undefined
లోకేశ్‌భీమిలిలో పోటీ చేయాలనుకుంటే గంటా విశాఖ ఉత్తరం లేదా విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేయవచ్చునని అంటున్నారు. లోకేశ్‌ విశాఖ ఉత్తరంలో పోటీ చేయాలనుకుంటే గంటా భీమిలి నుంచే పోటీ చేస్తారని భావిస్తున్నారు
undefined
యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు కూడా విశాఖ ఉత్తరం సీటు కోరుకుంటున్నారు. కానీ లోకేశ్‌ వస్తే ఆయన యలమంచిలిలోనే కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేశ్‌ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు
undefined
తన తండ్రి చంద్రబాబు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందువల్ల తాను ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. తద్వారా రాష్ట్రంలో ఇరు ప్రాంతాలకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అనిపించుకోవచ్చునని ఆయన భావనగా కనిపిస్తోంది
undefined
ఆయన తోడల్లుడు, దివంగత టీడీపీ నేత ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు భరత్‌ ఈసారి విశాఖ ఎంపీ సీటు ఆశిస్తున్నారు. లోకేశ్‌ విశాఖ జిల్లాలో పోటీచేస్తే భరత్‌కు అవకాశం ఉండకపోవచ్చునని అంటున్నారు. ఒకే జిల్లా నుంచి సమీప బంధువులకు ఇద్దరికి అవకాశం ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించకపోవచ్చునని అంటున్నారు
undefined
భరత్‌ కాని పక్షంలో ఎంపీ సీటుకు మంత్రి గంటా, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్లు ప్రతిపాదనకు వచ్చే అవకాశం ఉంది. గంటా గతంలో అనకాపల్లి ఎంపీగా పనిచేశారు. పల్లా శ్రీనివాసరావు 2009లో ప్రజారాజ్యం తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే, లోకసభకు పోటీ చేయడానికి గంటా సముఖంగా లేరని తెలుస్తోంది.
undefined
click me!