మహారాష్ట్ర రాజకీయాలు వేగంగా మలుపు తిరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజులకే సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. చెదిరిపోతుంది అనుకున్న ఎన్సీపీ ఎలాంటి కుదుపులు లేకుండా భాజాపా దాటికి తట్టుకోని నిలబడింది. ఎమ్యెల్యేలు ఎవరు చేజారుకుండా శరాద్ పవార్ పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్ళారు. దీంతో భాజాపాతో వెళ్ళిన అజిత్ పవార్ కూడా వెనిక్కి రాక తప్పలేదు.