మారిన జగన్ వ్యూహం: చంద్రబాబు పేరెత్తకుండా..

First Published Mar 18, 2019, 10:40 AM IST

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చినట్లు కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయకుండా ఆయన ప్రసంగాలు ఉండేవి కావు. 

విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చినట్లు కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయకుండా ఆయన ప్రసంగాలు ఉండేవి కావు. కానీ అనూహ్యంగా ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నారు.
undefined
చంద్రబాబుపై విమర్శలను పక్కన పెట్టేసి, తమ పార్టీ అధికారంలోకి వస్తే తాను ఏమేం చేస్తాననే విషయాలను వెల్లడించడానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆదివారం నర్సీపట్నంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన చేసిన ప్రసంగాన్ని బట్టి ఆ విషయం అర్థమవుతోంది.
undefined
తాను ముఖ్యమంత్రిని అయితే అన్ని పరిశ్రమల్లోనూ 75 శాతం ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. నేను విన్నాను, నేను విన్నాను అనే యాత్ర సినిమా డైలాగుతో తన ప్రసంగాన్ని జగన్ ప్రారంభించారు.
undefined
2014 నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ ఎన్నికల్లో తన ప్రచారం ద్వారా తాను అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.
undefined
తాను 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, ప్రజల సమస్యలన్నీ విన్నానని, ఆ సమస్యలను పరిష్కరించడానికి తాను కృషి చేస్తానని ఆయన చెప్పారు. మీ ఓటును అడగడానికి ముందు నేను అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తానో చెప్తానని ఆయన అన్నారు.
undefined
click me!