జగన్ వైపు సినీ ఇండస్ట్రీ: వైసిపిలోకి పూరి జగన్నాథ్

First Published Mar 11, 2019, 6:35 PM IST

మాజీఎమ్మెల్యే, సినీనటి జయసుధ తనయుడుతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరుసటిరోజు సినీనటుడు జోగినాయుడు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. సోమవారం ఉదయం హాస్య నటుడు ఆలీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తాజాగా మరో ప్రముఖ దర్శకుడు వైఎస్ జగన్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పోకిరీ, చిరుత, వంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ లను అందించిన పూరీ జగన్నాథ్ కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. 

అందుకే ఎన్నికల సమయంలో సినీనటులకు ఆయా రాజకీయ పార్టీలు పెద్దపీటే వేస్తాయి. ఎవరు ఏ హీరో, హీరోయిన్ పార్టీలోకి వస్తారా..వచ్చే ఉద్దేశం ఉందా అంటూ అంచనాలు వేస్తుంటారు. ఇప్పుడు ఏపీలో అదే సందడి నెలకొంది. సినీనటులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారు.
undefined
వార్ వన్ సైడ్ అన్నట్లు సినీ ఇండస్ట్రీకి సంబంధించి అత్యధికశాతం నటులు వైసీపీవైపే మెుగ్గు చూపుతున్నారు. తారల సందడితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ లో ఉంది. రోజురోజుకీ సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు, వారి బంధువులు కీలక నేతలై వైసీపీ కండువా కప్పుకుంటుండటంతో రాబోయే ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
undefined
ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో ప్రారంభమైన సినీ నటుల చేరికలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరింత జోరందుకున్నాయి.
undefined
ఇటీవలే మాజీఎమ్మెల్యే, సినీనటి జయసుధ తనయుడుతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరుసటిరోజు సినీనటుడు జోగినాయుడు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. సోమవారం ఉదయం హాస్య నటుడు ఆలీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
undefined
తాజాగా మరో ప్రముఖ దర్శకుడు వైఎస్ జగన్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పోకిరీ, చిరుత, వంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ లను అందించిన పూరీ జగన్నాథ్ కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. వైఎస్ జగన్ కుటుంబానికి పూరీ జగన్నాథ్ అత్యంత సన్నిహితుడు.
undefined
తాజాగా మరో ప్రముఖ దర్శకుడు వైఎస్ జగన్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పోకిరీ, చిరుత, వంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ లను అందించిన పూరీ జగన్నాథ్ కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. వైఎస్ జగన్ కుటుంబానికి పూరీ జగన్నాథ్ అత్యంత సన్నిహితుడు.
undefined
అయితే ఉమాశంకర్ గణేష్ మంత్రి అయ్యన్నపాత్రుడు చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా ఉమాశంకర్ గణేష్ ఏమాత్రం వెనుకడుగు వెయ్యలేదు. వైసీపీని అంటిపెట్టుకునే ఉన్నారు. కాలక్రమేణా వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడయ్యారు ఉమాశంకర్ గణేష్.
undefined
2019 ఎన్నికల్లో నర్సీపట్నం టికెట్ మళ్లీ ఉమాశంకర్ గణేష్ కే కేటాయించనున్నారు వైఎస్ జగన్. ఈ పరిణామాల నేపథ్యంలో పూరీ జగన్నాథ్ వైఎస్ జగన్ తో టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. త్వరలోనే పూరీ జగన్నాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
undefined
ఇప్పటికే వరుసగా పలువురు సినీనటులు పోటాపోటీగా వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో పూరీజగన్నాథ్ కూడా త్వరలోనే వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. 2014 ఎన్నికల్లో తన సోదరుడు ఉమాశంకర్ గణేష్ తరపున ప్రచారం చేసిన పూరీ తన మాటలతో అందర్నీ ఆకట్టుకున్నారు.
undefined
అయితే పూరీ జగన్నాథ్ ఈసారి కేవలం నర్సీపట్నం నియోజకవర్గానికే కాకుండా వైసీపీ తరపున యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రచారం చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. లేకపోతే వైసీపీకి స్క్రిప్ట్ లు రెడీ చేసే అవకాశం కూడా లేకపోలేదని కూడా తెలుస్తోంది.
undefined
ఇకపోతే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినీనటుల చేరికలతో సందడిగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నటి రోజా ఆతర్వాత విజయ్ చందర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం పార్టీలో పనిచేశారు. వీరితోపాటు చాలామంది చేరినప్పటికీ ఎన్నికల తర్వాత పాలిటిక్స్ దూరమై సినీ ఇండస్ట్రీలో బిజీ అయిపోయారు.
undefined
కానీ రోజా, విజయ్ చందర్ మాత్రమే వైసీపీలో కొనసాగుతున్నారు. అటు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా చనిపోయే వరకు వైసీపీలోనే కొనసాగారు. వీరిలో రోజా నగరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఏపీ రాజకీయాల్లో రోజా ఫైర్ బ్రాండ్ గా పిలవబడుతున్నారు.
undefined
మరోవైపు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున వైఎస్ జగన్ ను కలిసి అభినందించారు. సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన జగన్ ను నాగార్జున స్వయంగా ఇంటికి వెళ్లి తన మద్దతు ప్రకటించారు.
undefined
ఇకపోతే మంచు విష్ణు సైతం వైఎస్ జగన్ ని కలిశారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ముంగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత ఆయనను విష్ణుదంపతులు కలిశారు. పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు. విష్ణు భార్య వెరోనికా వైఎస్ జగన్ కు దగ్గరిబంధువు కూడా.
undefined
మరోవైపు నాగార్జున మేనల్లుడు హీరో సుమంత్ సైతం జగన్ ను కలిశారు. వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్ ని కలిశారు. తన సినిమాకు సంబంధించి పోస్టర్ ను జగన్ తో ఆవిష్కరించారు సుమంత్. ఇకపోతే సుమంత్, వైఎస్ జగన్ ఇద్దరూ క్లాస్ మేట్స్ కావడం విశేషం.
undefined
ఆ తర్వాత ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ వైఎస్ జగన్ ను కలిశారు. పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ను ఆయన కలిశారు. తన సంఘీభావం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
undefined
ఇకపోతే ప్రముఖ కెమెరామెన్ ఛోటా కె.నాయుడు సైతం జగన్ కు జై కొట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన సంఘీభావం ప్రకటించారు. జగన్ మంచి విజన్ ఉన్న నేత అంటూ కొనియాడారు. తండ్రి వైఎస్ఆర్ లాగే జగన్ కూడా మాటతప్పని వ్యక్తి అని రాబోయే ఎన్నికల్లో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడతారని తెలిపారు.
undefined
అటు అలనాటి హీరో భానుచందర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర చేస్తుండగా ఆయన జగన్ ని కలిసి మద్దతు ప్రకటించారు. అనంతరం వైసీపీలో చేరిపోయారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు.
undefined
మరో హీరో కృష్ణుడు సైతం వైసీపీ కండువాకప్పుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తుండగా జగన్ ను కలిసి తన మద్దతు ప్రకటించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమానికి అయినా ముందుంటున్నారు.
undefined
ఇకపోతే మరో ప్రముఖ నటుడు పృధ్వీరాజ్. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అందర్నీ నవ్వించే పృధ్వీరాజ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పదవిని సైతం పట్టేశారు. సినిమాల్లో అందర్నీ నవ్వించే ఆయన రాజకీయాల్లో తన మాటల తూటాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.
undefined
వీరితోపాటు ప్రముఖ సినీనటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వెంట తాను నడుస్తానని చెప్పుకొచ్చారు. తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని ఆయన తనయుడు జగన్ వెంట నడిచి ఆయన రుణం తీర్చుకుంటానని ప్రకటించారు.
undefined
అటు ప్రముఖ సినీనటుడు, కమెడియన్ ఆలీ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆలీ తెలుగుదేశం పార్టీలో చేరతారని, కాదు జనసేన లో చేరతారని మరోసారి, లేదులేదు వైసీపీలో చేరతారంటూ మరోసారి ఇలా ఎన్నెన్నో ప్రచారాలు జరిగిపోయాయి. కానీ ఆలీ మాత్రం వైఎస్ జగన్ కే జై కొట్టారు. మడమతిప్పని మాట తప్పని జగన్ అంటే తనకు ఎంతో అభిమానమని అందుకే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
undefined
వీరంతా ఒక ఎత్తైతే జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనంగా మారింది. లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న ఆయన జగన్ ను సీఎం చెయ్యడమే తన లక్ష్యమంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు వైసీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడిగా మంచి ఛాన్స్ కొట్టేశారు కూడా. ఇకపోతే నార్నె శ్రీనివాసరావు గుంటూరు జిల్లా నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
undefined
కమెడీయన్ జోగినాయుడు సైతం వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో జోగినాయుడుతోపాటు పలువురు సినీనటులు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు తెలుగు సీరియల్ లో పలు పాత్రల్లో నటిస్తూ అందర్నీ మెప్పిస్తున్న నటులు జయశ్రీ, పద్మరేఖ, ఆశ, ప్రిద్విక, మీనాక్షి తేజస్వినిలు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరంతా కమెడియన్ పృథ్విరాజ్, కృష్ణుడుల సమక్షంలో వైసీపీ కండువాకప్పుకున్నారు.
undefined
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరింతమంది సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం లిస్ట్ లో పూరీ జగన్నాథ్ పేరు మాత్రం ప్రముఖంగా వినబడుతోంది. ఆయన వైసీపీలో చేరతారా లేక తమ్ముడికోసం ఎన్నికల ప్రచారంలోనే పాల్గొంటారా అన్నది వేచి చూడాలి.
undefined
click me!