వైసీపీ ఎమ్మెల్యే ఓటుకు ఎసరు: తొలగింపునకు దరఖాస్తు

First Published Mar 6, 2019, 10:26 AM IST

చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ ఓటును తొలగించాలంటూ ఎన్నికల అధికారులకు ధరఖాస్తులు అందాయి. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను  ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించేందుకు కుట్ర పన్నారని ఎమ్మెల్యే సునీల్  ఆరోపించారు.

చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ ఓటును తొలగించాలంటూ ఎన్నికల అధికారులకు ధరఖాస్తులు అందాయి. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించేందుకు కుట్ర పన్నారని ఎమ్మెల్యే సునీల్ ఆరోపించారు.
undefined
చిత్తూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 1.10 లక్షల ఓట్లను తొలగించాలని కోరుతూ ఫారం-7 ధరఖాస్తులు అందాయి. పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న సునీల్‌ ఓటును కూడ తొలగించేందుకు అధికారులకు ధరఖాస్తులు అందాయి.
undefined
ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే షాక్‌కు గురయ్యారు. తన ఓటును తొలగించాలని తనకు తెలియకుండా ధరఖాస్తులు రావడంపైచ సునీల్ ఆరా తీశారు. ఈ విషయమై సునీల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏ కంప్యూటర్ నుండి ఎమ్మెల్యే సునీల్ ఓటు తొలగింపు కోసం ధరఖాస్తులు అందాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ కంప్యూటర్ ఐటీ అడ్రస్ ఆధారంగా కేసు నమోదు చేశారు.
undefined
జిల్లాలో ఈ తరహా ఐదు కేసులు నమోదైనట్టుగా అధికారులు చెబుతున్నారు. మరో వైపు ఈ జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 20 వేల ఓట్లను తొలగించాలని ధరఖాస్తులు అందాయని ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఇంచార్జీ చిత్తూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
undefined
ఇదే జిల్లాలోని చిత్తూరు నియోజకవర్గం నుండి 10 వేలు, పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 వేల ఓట్లు తొలగించాలని ధరఖాస్తులు అందాయి. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే కుట్రను చేస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ ఆరోపించారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను కూడ తొలగిస్తున్నారని కూడ టీడీపీ నేతలు కూడ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
undefined
click me!