ఎమ్మెల్యే రోజాపై పవన్ కళ్యాణ్ ప్రయోగించే అస్త్రం ఆమె

Published : Mar 01, 2019, 05:43 PM IST

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. 2014 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన రోజా తనదైన శైలిలో అతి తక్కువ కాలంలోనే ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. అసెంబ్లీలోనూ బయట అధికార తెలుగుదేశం పార్టీపై మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు

PREV
114

214
ఇంకా చెప్పాలంటే ఏపీ అసెంబ్లీలో రోజా ఉన్నారంటే ఆ హంగామానే వేరు. ఏ సబ్జెక్టు అయినా సరే పట్టుకున్నారంటే రోజా దుమ్ముదులపాల్సిందే. అధికార పార్టీ ముక్కుపిండాల్సిందే. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై ఆమె చేసే విమర్శల దాడి తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు.

314
పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా అంతలా టార్గెట్ చేసి ఉండరేమో అనిపించేలా విరుచుకుపడతారు రోజా. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో నిధులు ఇవ్వకుండా ఆమె ఎదుగుదలను అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారని ప్రచారం కూడా ఉంది.

414
అటు ఎమ్మెల్యే రోజా కూడా తనకు ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో తమకు నిధులు ఇవ్వడం లేదని, నియోజకవర్గానికి ఏమీ చెయ్యలేకోపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజల్లో సానుభూతి కొట్టేశారు. అధికార పార్టీ సహకరించకపోతే అధికారులు ఉన్నారుగా అంటూ అటువైపు నరుక్కొచ్చారు రోజా

514
అధికారులను తనవైపుకు తిప్పుకుని పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇంకా తీవ్ర సమస్యలు ఉన్న ప్రాంతాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి వాటిని పరిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు సేవా కార్యక్రమాల్లోనూ అన్ని పార్టీల కంటే ముందే ఉన్నారు. రూ.4కే భోజనం అందజేస్తున్నారు. అలాగే ఉచితంగా సురక్షిత నీరు అందిస్తున్నారు

614
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు సైతం కల్పిస్తున్నారు. అటు పార్టీ కార్యక్రమాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇటు రాజకీయాల పరంగానూ అటు సేవా కార్యక్రమాల్లోనూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీపైనే కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా నిప్పులు చెరుగుతున్నారు రోజా

714
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇతర పార్టీలు చేసే ఆరోపణలను తిప్పికొట్టడమే లక్ష్యంగా ఆమె చెలరేగిపోతుంటారు. దాంతో ఎమ్మెల్యే రోజా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొరకరానికి కొయ్యగా మారారు. ఇంకా చెప్పాలంటే పంటి కింద రాయిలా, కొరకరాని కొయ్యలా మారారని చెప్పుకోవచ్చు. దీంతో అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు రోజా ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

814
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేష్ సైతం రోజా ఓటమిపై ప్రత్యేక దృష్టి సారించారు. దివంగత నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడు భాను ప్రకాశ్ ను బరిలోకి దించారు. ఒకవేళ భాను ప్రకాష్ కూడా గట్టి పోటీ ఇవ్వని పక్షంలో అభ్యర్థిని సైతం మార్చాలని ప్లాన్ లో ఉన్నారు చంద్రబాబు. ఇకపోతే అదే కోవలో పయనిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

914
2019 ఎన్నికల్లో రోజా ఓటమి లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకు జనసేన పార్టీ తరపున బలమైన మహిళా అభ్యర్థిని రంగంలోకి దించాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. సంఘసేవకురాలిగా, ప్రత్యేక హోదా ఉద్యమంలో పోరాటం చేస్తూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అందరి మన్నలను అందుకున్న ఆకేపాటి సుభాషిణిని జనసేన అభ్యర్థిగా బరిలోకి దించాలని జనసేనాని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

1014
ఆకేపాటి సుభాషిణికి సంఘసేవకురాలిగా మంచి గుర్తింపు ఉంది. మహిళా సమస్యలపై పోరాడుతూ ఆమె నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంటారు. మహిళా సమస్యలపై పోరాడటమే కాకుండా, 1997లో మహిళలను చైతన్యవంతం చేసేందుకు మహిళా మండలిని ఏర్పాటు చేశారు. అలాగే మహిళలు ఆర్థికంగా నిలబడాలనే ముఖ్య ఉద్దేశంతో వారికి ఉపాధి పనుల్లో శిక్షణ కల్పిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు.

1114
ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆమె మహిళల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే ఇటీవలే ఆమె జనసేన పార్టీలో చేరారు. చిత్తూరు జిల్లాలో పార్టీ సిద్ధాంతాలను, కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆమె చూపిస్తున్న చొరవ చూసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమెను తిరుపతి పార్లమెంట్ కన్వీనర్ గా నియమించారు

1214
ఆకేపాటి సుభాషిణి నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవలే జనసేన పార్టీ స్క్రీనింగ్ కమిటీకి తన బయోడేటాను అందజేశారు. అయితే ఆమె అభ్యర్థిత్వంపై పార్టీలో ప్రత్యేక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా బలమైన అభ్యర్థిగా ఉన్నారు.

1314
ఆమెను ఓడించాలంటే అన్ని రంగాల్లో బలమైన అభ్యర్థి అయితే కానీ సాధ్యం కాదని జనసేన పార్టీ భావిస్తుంది. ఆకేపాటి సుభాషిణిని బరిలోకి దించితే రోజాకు గట్టి పోటీ ఇవ్వడంతోపాటు గెలిచే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ భావిస్తోంది.

1414
త్వరలోనే ఆకేపాటి సుభాషిణి అభ్యర్థిత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆకేపాటి సుభాషిణి బరిలోకి దిగితే నగరి నియోజకవర్గంలో రసవత్తరపోరు జరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు

click me!

Recommended Stories